మరోసారి చొక్కా తీసేసి ఫోటోలకు ఫోజులిచ్చిన అఖిల్.. హ్యాపీ న్యూ ఇయర్ అంటూ..

అక్కినేని అఖిల్ ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘ఏజెంట్’ సినిమా చేస్తూ బిజీగా ఉన్నాడు.ఈ మధ్యనే బ్యాచిలర్ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన అఖిల్ అదే జోష్ లో ఈ సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నాడు.

 Akhil Akkineni Stylish Look On New Year Details, Agent,akhil,akhil Akkineni,akhi-TeluguStop.com

ఈ సినిమాలో లవర్ బాయ్ గా కనిపించిన అఖిల్ ఇప్పుడు సురేందర్ రెడ్డి తో తీసే ఏజెంట్ సినిమాలో పూర్తిగా లుక్ మార్చేసి కండలు తిరిగిన శరీరాన్ని రెడీ చేసాడు.

ఈ సినిమా కోసం అఖిల్ అంత కష్టపడి కండలు పెంచి మేకోవర్ అవ్వడంతో ఫ్యాన్స్ అంత షాక్ అయ్యారు.

ఇటీవలే అఖిల్ కండలు చూపిస్తూ దిగిన ఫోటో నెట్టింట్లో వైరల్ అయ్యింది.ఇక ఇప్పుడు తాజాగా మరొకసారి చొక్కా తీసేసి దిగిన ఫోటోను అఖిల్ షేర్ చేసాడు.

ఈ రోజు న్యూ ఇయర్ సందర్భంగా అఖిల్ ప్రేక్షకులందరికీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు చెబుతూ సోషల్ మీడియా వేదికగా తన ఫోటో ను షేర్ చేసాడు.

ఈ ఫొటోలో మరొకసారి తన కండలు తిరిగిన దేహంతో ఫొటోకు ఫోజులిచ్చి అఖిల్ అమ్మాయిలకు మన్మథుడిగా మరి పోయాడు.

”కొత్త సంవత్సరం.కొత్త నేను.2022 లో నేను మీ కోసం సిద్ధంగా ఉన్నాను.మీలో ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు.

లెట్ యువర్ ఫైర్” అంటూ చొక్కా లేకుండా దిగిన ఫోటోను అఖిల్ సోషల్ మీడియాలో షేర్ చేసాడు.

ఈ ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.ఈ ఫోటో చూసిన నెటిజెన్స్ కొంతమంది అఖిల్ ను హాలీవుడ్ లో అదృష్టం పరీక్షించుకోమని చెబుతున్నారు.స్పై త్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమాను ఏకే ఎంటర్టైన్ మెంట్స్, సురేందర్ రెడ్డి 2 సినిమా సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఈ సినిమాకు కూడా టాలీవుడ్ మ్యూజిక్ సెన్సషన్ థమన్ సంగీతం అందిస్తుండగా.సాక్షి వైద్య కథనాయికగా నటిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube