సంపాదన పెరగాలి.డబ్బు ఎక్కువగా మన చేతుల్లో ఉండాలి అనుకునే వారు ఇళ్లలో ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే మేలు.
వాస్తు శాస్త్రం ప్రకారం ఈ సూచనలు అనుసరిస్తే డబ్బు సంపాదించే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు వాస్తు నిపుణులు.
డబ్బు కోసం మీ ఇంటిలో పాటించాల్సిన వాస్తు చిట్కాలు ఇవే. ఇంట్లో దక్షిణం వైపు కాస్త ఎత్తు ఉండేలా చూసుకోవాలి.లేదంటే దక్షిణం వైపు ఎత్తు సమానంగా అయినా ఉండాలి.ఈ రెండింటిలో ఏదో ఒకటి పక్కాగా పాటించాలి.ఇంటి ఈశాన్య భాగంలో ఉత్తరం వైపు డోర్ ఉండేలా చూసుకోవాలి.దీని ద్వారా ఇంట్లోకి డబ్బు వచ్చే మార్గాలు మెరుగవుతాయి.ఈశాన్యం-తూర్పు ద్వారాన్ని తెరిచి ఉంచడం వల్ల మంచి పేరు ప్రతిష్టలతో పాటు ధనప్రాప్తి ఉంటుంది.
ఈశాన్యంలో నీటి నిల్వ ఉంచుకునే సంప్ ఉండడం మేలు.దీంతో డబ్బుతో పాటు ఆ ఇంట్లో శాంతి ఉంటుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
ఇక భారీగా బరువు ఉండే వస్తువులను దక్షిణ, నైరుతి వైపు ఉంచడం వల్ల ఇంట్లోకి డబ్బు వచ్చే మార్గాలు మెరుగవుతాయి.ఇక మనం ఉండే ఇళ్లు లేదు అపార్ట్‌మెంట్ దక్షిణం వైపు ఉందనుకోండి అలాంటి ఇళ్లలోకి డబ్బు ఎక్కువగా వస్తుందని వాస్తు శాస్త్రం చెప్తోంది.
పడమర వైపు ఉండే అపార్ట్‌మెంట్లలోకి, ఇళ్లపై ధనలక్ష్మి ప్రభావం బాగా ఉంటుంది.అలాంటి ఇళ్లలో ఉండే వారికి సంపాదన పెరిగి డబ్బు వస్తూ ఉంటుంది.
ఇక నైరుతి వైపు నిర్మించే భారీ నిర్మాణాలలోకి, పెద్ద భవనాల్లోకి ఎల్లప్పుడూ డబ్బు ప్రవాహం బాగానే ఉంటుంది.