సాధారణంగా ఆదివారం అనగానే మన ఆలోచనా విధానం మారుతుంది.చేసే పనుల మీద శ్రద్ధ పెట్టము వాటిని నిర్లక్ష్యం చేస్తూ వస్తాం.
అలాగే పార్టీలు వగైరా ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటారు.కానీ మనకు తెలియని విషయం ఏమిటంటే ఆదివారం కొన్ని పనులు చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయని అంటున్నారు పండితులు.
మరి ఏ పనులు చేయకూడదు అనేది ఇక్కడ తెలుసుకుందాం.
మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఆదివారం సూర్యునికి అత్యంత ప్రీతికరమైన రోజు.
అందుకే ‘ఆదివారం’ని రవివారం అని కూడా పిలుస్తారు.మన పురాతన ధర్మాలలో ఏ రోజుకి కూడా ఇవ్వని ప్రాధాన్యత ఆదివారంకి ఇచ్చారు.
మాంసం తినడం, జుట్టుకు నూనె పెట్టుకోవడం, స్త్రీలతో సాంగత్యం, స్త్రీలు తలకు స్నానం చేయడం వంటి పనులు ఆదివారం అసలు చేయకూడదు.
ఎందుకంటే అనాదిగా మన పూర్వీకులు సూర్యుని నమస్కరించే వారు.అంతే కాకుండా వీరు చేసే ప్రతి పండుగలు కూడా సౌర మాసంలో చేస్తారు.వేకువ జామున నిద్ర లేవడంతో సూర్య నమస్కారాలు, సంధ్యా నమస్కారాలు చేసేవారు.
ఆదివారం నాడు సూర్య భగవానుడికి ప్రత్యేక పూజలు చేస్తారు తెల్ల బియ్యంను సూర్యునికి సమర్పించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి.అలాగే సూర్యున్ని ఎర్ర రంగు పూలతో పూజించాలి.
మహిళలు ఆదివారం పూట ఎర్ర రంగు పువ్వులను ధరించడం వల్ల దీర్ఘ సుమంగళిగా వర్ధిల్లుతారు.ఇంతటి ప్రత్యేకత కలిగిన ఆదివారము, మన సరదాల పేరుతో సంతోషాల పేరుతో మాంసం తినడం, పార్టీలు చేసుకోవడం వంటి వాటికి అలవాటు పడ్డాము.
ఇలాంటి పనులు చేయడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయని వేద పండితులు కూడా చెబుతున్నారు.
.