మార్గశిర పౌర్ణమి రోజు ఈ వస్తువులను దానం చేయడం ఎంతో శుభం!

హిందూ క్యాలెండర్ ప్రకారం తెలుగు మాసాలకు ఎంతో ప్రత్యేకత ఉంది.ఒక్కో మాసం ఒక్కో విధమైనటువంటి ప్రత్యేకతను కలిగి ఉండటం వల్ల తెలుగు మాసాలు భక్తులు పెద్దఎత్తున పూజా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారు.

 It Is Very Auspicious To Donate These Items On The Margashira Paurnami Day, Marg-TeluguStop.com

కార్తీకమాసం వచ్చిన తర్వాత మార్గశిర మాసం కూడా ఎంతో పవిత్రమైన మాసంగా భక్తులు భావిస్తారు.ఇక మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమి రోజు పెద్ద ఎత్తున విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి పూజలు చేయడం వల్ల అమ్మవారి కరుణాకటాక్షాలు ఎల్లవేళలా ఉంటాయని భావిస్తారు.

మరి ఈ ఏడాది మార్గశిర పౌర్ణమి ఎప్పుడు వచ్చింది? ఈ పౌర్ణమి శుభ సమయం ఏమిటి? ఈ పౌర్ణమి రోజు ఎలాంటి వస్తువులు దానం చేయాలి అనే విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

ఈ యేడాది మార్గశిర పౌర్ణమి డిసెంబర్ 18 శనివారం ఉదయం 07.24 గంటలకు ప్రారంభం కాగా 19వ తేదీ ఆదివారం ఉదయం 10.05 వరకు కొనసాగుతుంది.డిసెంబర్ 18వ తేదీ ఉదయం 09.13 గంటల వరకు సాధ్య యోగం, ఆ తర్వాత శుభ యోగం ప్రారంభమవుతుంది.ఈ పౌర్ణమి రోజు భక్తులు పెద్ద ఎత్తున ఉపవాసాలతో విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని పూజించడం వల్ల వారి కరుణాకటాక్షాలు మనపై ఉండి ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా కాపాడుతుందని భావిస్తారు.

సాధారణంగా కొందరు జాతకంలో చంద్రుడు బలహీన స్థానంలో ఉంటారు.

అలాంటివారు మార్గశిర ఏకాదశి రోజు దాన ధర్మాలు చేయడం వల్ల వారి జాతకంలో దోషాలు తొలగిపోతాయి.ఈ క్రమంలోనే పౌర్ణమి రోజు పూజ అనంతరం మన ఆర్థిక స్థోమతను బట్టి  కొద్దిగా  పాలు, పాయసం, బియ్యం, ముత్యాలు, వంటి తెలుపురంగు వస్తువులను దానం చేయటం వల్ల ఎంతో మంచి ఫలితాలను పొందవచ్చు.

ఇక ఈ పౌర్ణమి రోజు వీలైనంత వరకు సత్యనారాయణ స్వామి కథ వినడం లేదా చదవడం చేయడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube