జనసేన అధినేత పవన్ సమాజంలో మార్పు తీసుకురావాలనే లక్ష్యంతో 2014లో రాజకీయాలలో అడుగు పెట్టారు.అప్పుడున్న పరిస్థితుల కారణంగా బీజేపీ అధికారంలోకి రావాలని మద్దతు ప్రకటించారు.
ఆ తరువాత అధికార టీడీపీతో జత కట్టారు.పవన్ సపోర్ట్ వల్లే ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చిందనే చర్చ కూడా ఉంది.
తదనంతరం వామపక్షలతో కలిసి నడవడం ఇలా పవన్ తీసుకున్న నిర్ణయాలు సినిమాలోని ఈస్ట్ మన్ కల్సన్‌ను మించిపోయ్యాయి.
ప్రతి పక్ష వైసీపీ మీద విమర్శనాస్త్రాలు ఎక్కు పెట్టారు.2018లో పవన్ టీడీపీని కూడా టార్గెట్ చేశారు.కానీ అంతా ప్రజలు పట్టించుకోలేదు.2019 సాధారణ ఎన్నికలలో జనసేనాని కమ్యూనిస్టులతో కలిసి పోటీలో దిగారు.ఆ ఎన్నికలలో ఘోర పరాజయం తప్పలేదు.
టీడీపీ, జనసేన ఒక్కటే అంటూ వైసీపీ నాయకులు ప్రచారం చేశారు.కమ్యూనిస్టులతో కలిసి రాకపోడంతో పవన్, బీజేపీతో కలిసిపోయ్యారు.
ఆంధ్రపదేశ్‌లో బీజేపీ, జనసేన మాత్రమే ప్రత్యామ్నాయం అని చెబుతున్నారు.అయితే తిరుపతి లోక్‌సభ కు జరిగిన ఎన్నికల తరువాత మళ్లీ టీడీపీ, పవన్ కళ్యాన్ కలిసిపోయ్యారని ప్రచారం మొదలైంది.
ఆ ఎన్నికలలో టీడీపీ కోసం పవన్ బీజేపీకి సపోర్ట్ చేయలేదు అని విమర్శలు గుప్పుమన్నాయి.ఎంపీటీసీ ఎన్నికలలో టీడీపీ, జనసేన మధ్య ఉన్న ఒప్పదంతో అధికారాన్ని పంచుకున్నారనే చర్చ జరుగ సాగింది.
దీంతో వైసీపీ నేతలు ఒక్కసారిగా పవన్‌పై మాటల దాడి మొదలు పెట్టారు.ఇటివల మంత్రి కొడాలి నాని మాట్టాడుతూ పవన్, చంద్రబాబుల ది వీడదీయని బంధం అంటూ విమర్శించారు.అసలు వారు ఎప్పుడు విడిపోయ్యారని ప్రశ్నించారు.వపన్ కళ్యాణ్ బాబును నమ్మి మోసపోతున్నారని వైసీపీ నేత రామచంద్రయ్య పరోక్షంగా విమర్శలు గుప్పించారు.ఈ విమర్శలు చంద్రబాబుకు లాభం చేస్తాయని, పవన్ కళ్యాణ్ సొంతంగా రాజకీయం చేయాలనుకున్న కష్టమేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.2014లో పార్టీ పెట్టిన పవన్ ఎవరితో జత కట్టకుండా మద్దతు ఇస్తే బాగుండేదని జనసేన కార్యర్తల ఆవేదన.