భారతీయ శాస్త్రవేత్త అద్భుత సృష్టి...ఆవ గింజలతో...

పునీత్ ద్వివేది ప్రస్తుతం అమెరికాలో ఈ పేరు మారు మోగుతోంది.భారత సంతతికి చెందిన పునీత్ ద్వివేది అమెరికాలో శాస్త్ర వేత్తగా పనిచేస్తున్నారు.

 Indian Scientist Puneet Dwivedi   Creates Plant-based Aircraft Fuel That Cuts Em-TeluguStop.com

తన అద్భుత మేధస్సుతో ఆయన చేసిన గొప్ప ఆవిష్కరణ ఫలితమే నేడు ఆయన పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగుతోంది.ఇంతకీ ఆయన చేసిన ఆవిష్కరణ ఏంటి, అసలు ఎవరీ పునీత్ ద్వివేది అనే వివరాలలోకి వెళ్తే…

భారత సంతతికి చెందిన పునీత్ ద్వివేది అమెరికాలో స్థిరపడ్డారు.

జార్జియా వర్సిటీ లోని వార్నల్ స్కూల్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ నెచ్యురల్ రిసోర్సెస్ విభాగంలో ప్రొఫెసర్ గా విధులు నిర్వహిస్తున్నారు.విమానాలకు వాడే ఇంధనం కంటే కూడా ఆవాల నుంచి వచ్చే ఒకరకమైన ఆయిల్ తో విమాన ఇంధనం తయారు చేయవచ్చునని దివ్వేది నిరూపించారు.

ఆవాలు మొక్కల నుంచి తీసిన ఇంధనం తో విమానాలు నడపడం వలన ప్రస్తుతం వాడుతున్న ఇంధనం నుంచీ వెలువడే కార్భన ఉద్గారాలను తగ్గించ వచ్చునని ఆయన అంటున్నారు.

Telugu Fuel Aircraft, Indianscientist, Aircraft Fuel, Puneet Dwivedi-Telugu NRI

దివ్వేదీ ఆయనతో పాటు మరో ముగ్గురు శాస్త్రవేత్తలతో కలిసి నాలుగేళ్లుగా ఈ ప్రాజెక్ట్ మీద పనిచేస్తున్నారు.ఆవాలు మొక్కల ద్వారా వచ్చే ఇంధనం వాడటం వలన 70 శాతం కార్బన్ ఉద్గారాలను తగ్గించవచ్చునని దివ్వేదీ సూచించారు.అంతేకాదు విమాన ఇంధనం ధరతో పోల్చితే ఆవాలు ఇంధనం తక్కువ ధరకు వస్తుందని ముడిసరుకు, ఆర్థిక మద్దతు ఇస్తే ఈ పరిశోధనలో మరింత ముందడుగు వేస్తామని డివ్వేది ప్రకటించారు

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube