నవరాత్రి మూడవ రోజు అమ్మవారి అలంకరణ.. నైవేద్యం..!

హిందూ క్యాలెండర్ ప్రకారం దేవీ నవరాత్రి ఉత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటారు.ఈ క్రమంలోనే దేవీ నవరాత్రి ఉత్సవాలు ఆశ్వయుజమాసం శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు, పదవ రోజు విజయ దశమి కలిసి దసరా అంటారు.

 During Navaratri Third Day Durga Mata Worshipped As Gayatri Devi Avater Details,-TeluguStop.com

తొమ్మిది రోజుల పాటు నవరాత్రి ఉత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటారు.ఈ నవరాత్రులలో భాగంగా భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారి ఆలయాలను సందర్శించి ఆ దుర్గ మాత దర్శనం చేసుకుంటారు.

తొమ్మిది రోజులు అమ్మవారు ప్రతిరోజు ఒక్కో అవతారంలో భక్తులకు దర్శనమిస్తారు.

నవరాత్రులలో భాగంగా మూడవ రోజు అమ్మవారు గాయిత్రిదేవిగా భక్తులకు దర్శనం ఇస్తున్నారు.నేడు అమ్మవారికి పూజ చేయడానికి ఉదయం7.30 నుంచి9.00 వరకు ఎంతో అనువైన సమయం అదే విధంగా సాయంత్రం 5.10 నుంచి7.25 వరుకు అమ్మవారికి పూజ చేయడానికి ఎంతో అనువైన సమయం.ఈరోజు అమ్మవారికి పసుపు రంగు వస్త్రాలను సమర్పించి కొబ్బరి అన్నం నైవేద్యంగా సమర్పించాలి.

దీనితోపాటు కొబ్బరి బెల్లం కలిపి కూడా అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చు.

ఈ విధంగా అమ్మవారిని అలంకరించి పూజలు చేసిన తర్వాత గాయత్రి చాలీసా చదవడం ఎంతో మంచిది.అదేవిధంగా గాయత్రి దేవి అమ్మవారికి తామరు పువ్వులు అంటే ఎంతో ఇష్టం కనుక ఈ రోజు పూజలో అమ్మవారికి తామర పువ్వులు సమర్పించడం ఎంతో శ్రేయస్కరం.ఈరోజు అమ్మవారికి పూజ చేసిన వారు వంకాయ కలిపిన ఆహారపదార్థాలకు దూరంగా ఉండాలి.

అదేవిధంగా ఎరుపురంగు గాజులను దానం చేయడం వల్ల ఎంతో తేజస్సు కలిగి ఉంటారు.ఇకపోతే పూజ అనంతరం అమ్మవారి స్తోత్రం ఓం గాయత్రీ మాత్రే నమః అనే మంత్రాన్ని 108 సార్లు చదవడం ఎంతో శుభకరం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube