పార్స్లీ ఆకులు ఇవి చూసేందుకు కొత్తి మీర మాదిరిగానే ఉంటాయి.కానీ.
కొత్తి మీరకు, పార్స్లీకి సంబంధమే ఉండదు.పార్స్లీ ఆకులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
ఎన్నో జబ్బులను నివారిస్తాయి.ముఖ్యంగా ప్రతి రోజూ పార్స్లీ టీ తాగితే గనుక బోలెడన్ని హెల్త్ బెనిఫిట్స్‌ను పొందొచ్చు.
మరి పార్స్లీ టీ ఎలా తయారు చేయాలి.? అసలు పార్స్లీ టీ తాగడం వల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటీ.? అన్నది ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా కొన్ని పార్స్లీ ఆకులను తీసుకుని బాగా కడిగి లైట్‌గా క్రష్ చేసుకోవాలి.
ఇప్పుడు ఒక బౌల్లో కప్పు వాటర్ పోసి అందులో క్రష్ చేసిన పార్స్లీ ఆకులు వేసి పది నిమిషాల పాటు మరిగించాలి.బాగా మరిగిన తర్వాత వడబోసుకుని అందులో కొద్దిగా తేనె, నిమ్మ రసం కలిపితే పార్స్లీ టీ రెడీ అయినట్టే.
ఈ అద్భుతమైన టీ ప్రతి రోజు ఒక కప్పు చొప్పున తీసుకుంటే.అందులో ఉండే విటమిన్ ఎ కంటి చూపును పెంచుతుంది .విటమిన్ ఇ చర్మాన్ని యవ్వనంగా మెరిపిస్తుంది, విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్స్ రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.అలాగే బరువు తగ్గాలనుకునే వారికి పార్స్లీ టీ ఓ అద్భుతమైన వరం అని చెప్పుకోవచ్చు.
అవును, రోజూ ఉదయాన్నే పార్స్లీ టీ తాగితే ఒంట్లో పేరుకు పోయిన కొవ్వంతా క్రమ క్రమంగా కరిగిపోతుంది.అంతేకాదు, పార్స్లీ టీ సేవించడం వల్ల రక్త పోటు అదుపులో ఉంటుంది.రక్తంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గి.గుండె సంబంధిత జబ్బులు దరి చేరకుండా ఉంటాయి.మధుమేహం వ్యాధి గ్రస్తుల్లో బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ తప్పకుండా ఉంటాయి.మరియు మహిళల్లో ఇరెగ్యులర్ పీరియడ్స్ సమస్య కూడా ఉండదు.