బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ ప్రస్తుతం అలౌకిక్ దేశాయ్ దర్శకత్వంలో సీత: ది ఇంకార్నేషన్ అనే సినిమాలో నటిస్తుంది.ఈ సినిమాలో కరీనా కపూర్ టైటిల్ పాత్రను పోషించగా.పాత్ర కోసం సుమారు రూ.12 కోట్ల వరకు పారితోషికం డిమాండ్ చేసిందని తెలిసింది.దీంతో ఈ విషయం గురించి బాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా హాట్ టాపిక్ గా మారింది.
కరీనా కపూర్ ఇదివరకు నటించిన సినిమాలలో చాలా వరకు 6 నుండి 8 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకునేది.
కానీ ఈ సినిమాలో సీత పాత్ర కోసం రెట్టింపు రెమ్యూనరేషన్ తీసుకుంది.ఒకే సారి ఇంత పారితోషికాన్ని పెంచడానికి కారణం.ఈ సినిమా షూటింగ్ దాదాపు 10 నెలల సమయం పడుతుందని అందుకే ఆ ఉద్దేశంతోనే ఇంత డిమాండ్ చేసిందని వార్తలు వినిపించాయి.దీంతో నెటిజన్లు సీత పాత్ర పై ఆమె అంత రెమ్యూనరేషన్ తీసుకోవడం కరెక్ట్ కాదని ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో హిందువుల మనోభావాలు దెబ్బ తీసిందని ఈ సినిమాలో ఈమె బదులు కంగనా రనౌత్ నటించడమే బెటర్ అని తెగ ట్రోలింగ్స్ చేశారు నెటిజన్లు.
ఇదిలా ఉంటే ఈ విషయం గురించి తాజాగా కరీనా కపూర్ స్పందించింది.ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కరీనా తాను మైథలాజికల్ మూవీలో సీత పాత్ర కోసం అంత మొత్తాన్ని డిమాండ్ చేయడం నిజమే అని ఒప్పుకుంది.ఇక ఈ డిమాండ్ పారితోషికం విషయంలో కాదని, మహిళల గౌరవానికి సంబంధించిందని తెలిపింది.
సినిమాలలో ముఖ్యమైన పాత్రల్లో నటించే హీరోయిన్ల పారితోషకం విషయాల్లో ఎంతో వ్యత్యాసం ఉంటుందని.ఈ విషయం గురించి గతంలో ఎవరు మాట్లాడే వారు కూడా కాదని తెలిపింది.కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయని అందుకే దీని గురించి అందరు మాట్లాడుతున్నారని తెలిపింది కరీనా.