సీత పాత్ర కోసం కరీనా భారీ డిమాండ్.. నెటిజన్స్ ట్రోలింగ్?

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ ప్రస్తుతం అలౌకిక్ దేశాయ్ దర్శకత్వంలో సీత: ది ఇంకార్నేషన్ అనే సినిమాలో నటిస్తుంది.

ఈ సినిమాలో కరీనా కపూర్ టైటిల్ పాత్రను పోషించగా.పాత్ర కోసం సుమారు రూ.

12 కోట్ల వరకు పారితోషికం డిమాండ్ చేసిందని తెలిసింది.దీంతో ఈ విషయం గురించి బాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా హాట్ టాపిక్ గా మారింది.

కరీనా కపూర్ ఇదివరకు నటించిన సినిమాలలో చాలా వరకు 6 నుండి 8 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకునేది.

కానీ ఈ సినిమాలో సీత పాత్ర కోసం రెట్టింపు రెమ్యూనరేషన్ తీసుకుంది.ఒకే సారి ఇంత పారితోషికాన్ని పెంచడానికి కారణం.

ఈ సినిమా షూటింగ్ దాదాపు 10 నెలల సమయం పడుతుందని అందుకే ఆ ఉద్దేశంతోనే ఇంత డిమాండ్ చేసిందని వార్తలు వినిపించాయి.

దీంతో నెటిజన్లు సీత పాత్ర పై ఆమె అంత రెమ్యూనరేషన్ తీసుకోవడం కరెక్ట్ కాదని ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో హిందువుల మనోభావాలు దెబ్బ తీసిందని ఈ సినిమాలో ఈమె బదులు కంగనా రనౌత్ నటించడమే బెటర్ అని తెగ ట్రోలింగ్స్ చేశారు నెటిజన్లు.

"""/"/ ఇదిలా ఉంటే ఈ విషయం గురించి తాజాగా కరీనా కపూర్ స్పందించింది.

ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కరీనా తాను మైథలాజికల్ మూవీలో సీత పాత్ర కోసం అంత మొత్తాన్ని డిమాండ్ చేయడం నిజమే అని ఒప్పుకుంది.

ఇక ఈ డిమాండ్ పారితోషికం విషయంలో కాదని, మహిళల గౌరవానికి సంబంధించిందని తెలిపింది.

"""/"/ సినిమాలలో ముఖ్యమైన పాత్రల్లో నటించే హీరోయిన్ల పారితోషకం విషయాల్లో ఎంతో వ్యత్యాసం ఉంటుందని.

ఈ విషయం గురించి గతంలో ఎవరు మాట్లాడే వారు కూడా కాదని తెలిపింది.

కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయని అందుకే దీని గురించి అందరు మాట్లాడుతున్నారని తెలిపింది కరీనా.

వైరల్ వీడియో: ఇద్దరు వ్యక్తులను రోడ్డుపై ఈడ్చుకెళ్లిన ట్రక్ డ్రైవర్