ఎన్టీఆర్.తెలుగు సినిమా పరిశ్రమ అభ్యున్నతిలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి.
తెలుగు సినిమా పరిశ్రమ ఈ రోజులు ఇలా కొనసాగుతుందంటే దానికి ప్రధాన కారణం కూడా ఆయనే అని చెప్పుకోవచ్చు.సినిమాలే కాదు.
రాజకీయాల్లో ఎనలేని గుర్తింపు పొందిన నాయకుడు నందమూరి తారక రామారావు.అప్పట్లో ఆయన పేరు చెప్తే జనాలు అభిమానంతో ఎగబడేవారు.సినిమా రంగంలో తను అన్ని పాత్రలూ పోషించాడు.ఏ పాత్రలో నటించినా అందులో లీనం అయ్యేవాడు ఎన్టీఆర్.సాంఘిక, పౌరాణిక, జానపద ఒకటేమిటీ అన్ని సినిమాలను అద్భుతంగా చేశాడు తను.ఏ పాత్రకు ఏ స్థాయి నటన కావాలో బాగా తెలిసిన వ్యక్తి ఎన్టీఆర్.మాయాబజార్ కృష్ణుడు, లవకుశ రాముడు, పాండవ వనవాసం భీముడు, దానవీరశూరకర్ణ దుర్యోధనుడు, సీతారామకళ్యాణం రావణుడు.హీరోగా, విలన్ గా అన్ని పాత్రల్లోనూ ఆయన ఇమిడిపోయాడు.సినిమా రంగం అయినా.రాజకీయాలు అయినా.
తనకు తానే సాటి అని నిరూపించుకున్నాడు.
రాజకీయాల్లోకి వచ్చాక.
ఎన్టీఆర్ పలు సవాళ్లను ఎదుర్కొన్నాడు.అదే సందర్భంలో లక్ష్మీపార్వతితో ఆయనకు పరిచయం ఏర్పడింది.అనంతరం తనని వివాహం చేసుకున్నాడు.ఆ తర్వాత ఎన్టీఆర్ విషయంలో ఆమె అంతా తానై చూసుకునేది.అదే ఆయన కొంప ముంచింది అనే విమర్శలూ ఉన్నాయి.వాటిని కాసేపు పక్కన పెడితే.
ఎన్టీఆర్ ఆరోగ్యం విషయంలో తను చాలా జాగ్రత్తలు తీసుకునేదట.అయితే ఎన్టీఆర్ చాలా కాలం మధుమేహంతో బాధపడ్డాడు.
సుమారు 35 ఏండ్ల పాటు ఆయనకు ఈ సమస్య ఉన్నది.అప్పుడు తన ఫుడ్ విషయంలో జాగ్రత్తలు అవసరం అని డాక్టర్లు సూచించారు.
అప్పుడే ఎన్టీఆర్ కు ఫుడ్ పెట్టే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకునేదట లక్ష్మీ పార్వతి.తీపి, కారం, నూనె చాలా తక్కువగా ఉండేలా చూసుకునేదట.
భోజన ప్రియుడు అయిన ఎన్టీఆర్.తన ఆహారం విషయలో లక్ష్మీ పార్వతి తీసుకుంటున్న జాగ్రత్తల పట్ల విసుగు చెందాడట.ఆమెకు వండటం తెలియదు.తినడం తెలియదని విసుక్కున్నాడట.అప్పటి నుంచి తను తీసుకుంటున్న నిబంధనలన్నీ పక్కకు పెట్టిందట లక్ష్మీ పార్వతి.నిజానికి భోజనాన్ని ఆస్వాదిస్తూ తినడం ఆయనకు అలవాటు.
చక్కటి భోజనం ఫుష్టిగా తినాలనుకునేవాడు.