మెగాస్టార్ కోసం మంచి టైటిల్ ను వదులుకున్న దర్శకుడు?

టాలీవుడ్ మెగాస్టార్ ప్రస్తుతం రీ ఎంట్రీ తో బాగా బిజీగా ఉన్నాడు.యువ హీరోలతో పోటీగా దూసుకుపోతున్నాడు.

 Director Sampath Nandi Sacrifices God Father Title For Chiranjeevi, Megastar Ch-TeluguStop.com

ఈయన సినిమాల కోసం అభిమానులు కూడా తెగ ఎదురు చూస్తున్నారు.తర్వాత మంచి సక్సెస్ అందుకున్న మెగాస్టార్ ఇప్పటికి కూడా అంతే సక్సెస్ అందించే సినిమాలలో నటిస్తున్నాడు.

ఇదిలా ఉంటే చిరంజీవి కోసం ఓ దర్శకుడు ఒక మంచి టైటిల్ ను వదులుకున్నాడు.

ప్రస్తుతం చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమాలో నటిస్తున్నాడు.

ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.ఇందులో కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ బిజీలో ఉండగా.త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పూర్తి కానుంది.

ఈ సినిమా షూటింగ్ తర్వాత మోహన్ రాజా దర్శకత్వంలో లూసిఫర్ రీమేక్ లో నటించనున్నాడు.ఈ సినిమా మలయాళంలో మంచి సక్సెస్ అందుకుంది.

దీంతో మలయాళంలో తెరకెక్కిన కథ కంటే కాస్త కొత్తదనం కూడా ఉంటుందని తెలిపారు.

Telugu Mohan Raja, God, Lucifer, Chiranjeevi, Sampath Nandhi, Tollywood-Movie

ముందుగా ఈ సినిమా కోసం కింగ్ మేకర్ అని ఓ టైటిల్ ను అనుకున్నారు.కానీ దానికంటే ఎక్కువగా ‘గాడ్ ఫాదర్‘ అనే టైటిల్ కూడా మంచి రెస్పాన్స్ రావడంతో ఈ టైటిల్ ను ఫిక్స్ అయ్యారు.కానీ అసలు సంగతి ఏంటంటే.

ఇదివరకే ఓ డైరెక్టర్ ఆ టైటిల్ ని ఫిక్స్ చేసుకున్నాడట.ఇంతకు ఆ డైరెక్టర్ ఎవరో కాదు సంపత్ నంది.

ఈయన గాడ్ ఫాదర్ అనే టైటిల్ ను తను తీయబోయే ప్రాజెక్టు కోసం ముందుగానే బుక్ చేసుకున్నాడు.

Telugu Mohan Raja, God, Lucifer, Chiranjeevi, Sampath Nandhi, Tollywood-Movie

కానీ లూసిఫర్ రీమేక్ కు ఈ టైటిల్ బాగా సెట్ అవడంతో సంపత్ నంది. తనకిష్టమైన ఈ టైటిల్ ను చిరంజీవికి త్యాగం చేశాడట.ఇక చిరంజీవి తనకు చిన్నతనం నుంచి మంచి అభిమానం ఉండటంతో.

ఆ సినీ బృందం సభ్యులు అడిగిన వెంటనే టైటిల్ ను ఇచ్చాడట.మొత్తానికి లూసిఫర్ రీమేక్ కు గాడ్ ఫాదర్ అనే టైటిల్ ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది.

ఇక ఈ సినిమాతో పాటు బాబీ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు.అంతేకాకుండా తమిళం మూవీ వేదాళం రీమేక్ లో కూడా నటించనున్నాడు.

ఇక ఈ సినిమాకు రమేష్ దర్శకత్వం వహించనున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube