పాము భయం ఉన్నవారు ఏ క్షేత్రాన్ని దర్శించాలో తెలుసా?

సాధారణంగా కొందరికి తరచూ పాములు కలలో కనిపిస్తుంటాయి.అదేవిధంగా పాములను చూస్తే మరికొందరికి ఎంతో భయంగా ఉంటుంది.

 A Place To Visit Fo Those Who Are Afraid Of Snakes Snakes, Telugu Bhakthi, Karn-TeluguStop.com

ఈ క్రమంలోనే పాములను తలచుకున్నప్పుడల్లా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.అదేవిధంగా రాత్రి సమయంలో పాము కనిపించినట్లు కలవరపడుతుంటారు.

ఈ విధంగా పాము భయం ఉన్నవారు శివాలయానికి వెళ్లి పూజలు చేయించడం, లేదా పుట్టకు వెళ్లి పాలు పోసి కొబ్బరికాయ కొట్టుకొని రావడం వంటివి చేస్తుంటారు.ఈ విధంగా చేసినప్పటికీ కొందరిలో ఈ భయం అలాగే వెంటాడుతుంటుంది.

ఈ విధంగా పాములను చూస్తే భయపడేవారు, ఈ పాముల భయం తొలగిపోవాలంటే ఏం చేయాలి? ఏ ఆలయానికి వెళితే ఈ భయం తొలగిపోతుంది అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

కర్ణాటక రాష్ట్రంలోని మంగుళూరుకు 10 కి.మీ దూరంలో ఉన్న కుడుపు అనే గ్రామంలో వుంది.కుడుపు అనగా తుళు భాషలో పాముతో ఉన్న బుట్ట అనే అర్థం వస్తుంది.

ఈ ఆలయంలో అనంత పద్మనాభ స్వామి పాము ఆకృతిలో ఉండే ఐదు తలలతో భక్తులకు దర్శనమిస్తున్నాడు.అయితే ఎవరైతే పాముల వల్ల ఎక్కువగా భయపడుతుంటారో అలాంటి వారు ఈ ఆలయానికి వచ్చి స్వామి వారిని దర్శనం చేసుకోవడం వల్ల వారికి పాము నుంచి కలిగే భయం తొలగిపోతుందని పండితులు చెబుతున్నారు.

Telugu Karnataka, Telugu Bhakthi-Telugu Bhakthi

ఈ క్రమంలోనే ప్రతి సోమవారం శ్రావణ మాసంలోని 5 వ రోజు వచ్చే నాగపంచమికి భక్తులు పెద్ద ఎత్తున ఈ ఆలయానికి సందర్శించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.ముఖ్యంగా ఈ గ్రామంలోని మహిళలు ఆవు పేడ,ఆవు పాలను కలిపి తమ ఇంటి గోడలపై పాము చిత్రాలను గీస్తారు.ఈ విధంగా ఇంటి గోడలపై చిత్రాలు గీయటం వల్ల వారికి పాములు కాటు వేయవని అక్కడ ప్రజలు ఎంతగానో విశ్వసిస్తారు.ఈ క్రమంలోనే పాము భయం ఉన్నవారు శ్రావణ మాసంలో వచ్చే నాగ పంచమి రోజు పెద్దఎత్తున ఆలయానికి వచ్చి స్వామివారికి మొక్కులు తీర్చుకుంటారు.

ఇలా చేయడం వల్ల పాము భయం పూర్తిగా తొలగిపోతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube