రెండో సినిమా ని స్టార్ట్ చేయబోతున్న బెల్లంకొండ గణేష్

బడా నిర్మాత బెల్లంకొండ సురేష్ ఫ్యామిలీ నుంచి పెద్ద కొడుకు శ్రీనివాస్ ఇప్పటికే హీరోగా ఎంట్రీ ఇచ్చి కమర్షియల్ హీరోగా ఏమర్జ్ అయ్యాడు.తండ్రి సపోర్ట్ తో భారీ బడ్జెట్ చిత్రాలు చేస్తూ హిట్, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా పెద్ద పెద్ద దర్శకులతో సినిమాలు చేసుకుంటూ ముందుకి పోతున్నాడు.

 Bellamkonda Ganesh Start Second Movie, Satish Vegesna, Krishna Chaitanya, Bellam-TeluguStop.com

ప్రస్తుతం హిందీలో ఛత్రపతి రీమేక్ లో నటిస్తున్నాడు.ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ కావాల్సి ఉంది.

ఇదిలా ఉంటే బెల్లంకొండ శ్రీనివాస్ తమ్ముడు గణేష్ కూడా హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయ్యాడు.అయితే ఈ యంగ్ హీరో అన్న దారిలో కాకుండా మొదటి సినిమాని ఓ కొత్త దర్శకుడుతో చేస్తున్నాడు.

ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.ఇదిలా ఉంటే ఇప్పుడు రెండో సినిమాని కూడా గణేష్ బాబు ఒకే చేసేశాడు.

శతమానం భవతి సినిమా దర్శకుడు అల్లరి నరేష్ నాంది సినిమాతో నిర్మాతగా మారి హిట్ కొట్టాడు.ఇప్పుడు మరో నిర్మాతగా మరో సినిమాని స్టార్ట్ చేస్తున్నాడు.చల్ మోహన్ రంగ, రౌడీ ఫెలో లాంటి సినిమాలని తెరకెక్కించిన లెరిక్ రైటర్ కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఈ మూవీ ఉండబోతుంది.ఇందులో హీరోగా గణేష్ ని ఫైనల్ చేసినట్లు సమాచారం.

నిజానికి కృష్ణ చైతన్య దర్శకత్వంలో పవర్ పేట ప్రాజెక్ట్ ని నితిన్ స్టార్ట్ చేయాల్సి ఉంది.అయితే ఎందుకనో దీని గురించి ఎలాంటి అప్డేట్ లేదు.

అయితే ఇప్పుడు ఈ దర్శకుడు గణేష్ తో సినిమా స్టార్ట్ చేస్తూ ఉండటం పవర్ పేట సినిమా ఆగిపోయినట్లే అనే మాట వినిపిస్తుంది.మరి లెరిక్ రైటర్ గా సక్సెస్ అందుకున్న కృష్ణ చైతన్య మొదటి సినిమా రౌడీ ఫెలోతో పరవాలేదనిపించుకున్న చల్ మోహన్ రంగాతో డిజాస్టర్ కొట్టాడు.

ఇప్పుడు గణేష్ తో మూవీకి ఎలాంటి రిజల్ట్ ఇస్తాడనేది చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube