ట్రూడో సంచలన నిర్ణయం.. కెనడా సుప్రీంకోర్ట్ న్యాయమూర్తిగా భారత సంతతి వ్యక్తి

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం వివిధ దేశాలకు వలస వెళ్లిన భారతీయులు ప్రస్తుతం ఆయా దేశాల్లో అత్యున్నత పదవుల్లో వున్న సంగతి తెలిసిందే.రాజకీయ, వాణిజ్య, ఆర్ధిక తదితర రంగాల్లో భారత సంతతి వ్యక్తులు దూసుకెళ్తున్నారు.

 Indian-origin Man First Person Of Color To Be Named For Canada Sc, Canada Sc, Ca-TeluguStop.com

అమెరికా, బ్రిటన్‌‌ల తర్వాత భారతీయులు పెద్ద సంఖ్యలో స్థిరపడిన కెనడాలోనూ మనవాళ్లు కీలక పదవుల్లో వున్నారు.తాజాగా ఆ దేశ చరిత్రలోనే తొలిసారిగా ఓ భారత సంతతి న్యాయకోవిదుడు మహమ్మద్ జమాల్‌ను కెనడా సుప్రీంకోర్ట్ న్యాయమూర్తిగా నామినేట్ చేశారు ప్రధాన్ జస్టిన్ ట్రూడో.

కెనడీయన్లను కాకుండా మరో వర్ణానికి చెందిన వ్యక్తిని ఆ పదవికి నామినేట్ చేయడం ఇదే తొలిసారి.

జమాల్‌ సుప్రీంకోర్టుకు విలువైన ఆస్తిగా మారతారని, అందుకే దేశంలోని అత్యున్నత న్యాయస్థానానికి ఆయన పేరును ప్రతిపాదన చేసి చరిత్ర సృష్టించానని ట్రూడో ట్వీట్‌ చేశారు.

జమాల్‌ నియామకాన్ని హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌లోని జస్టిస్‌ కమిటీ పరిశీలించాల్సి వుంటుంది .అయితే ఈ ప్రక్రియ కేవలం ఫార్మాలిటీ మాత్రమే అని తెలుస్తోంది.అందుచేత దాదాపుగా జమాల్ న్యాయమూర్తిగా ఖరారైనట్లే.

1967లో నైరోబిలోని ఒక భారత సంతతి (గుజరాత్‌) కుటుంబంలో జమాల్‌ జన్మించారు.బ్రిటన్‌లోనే ఆయన బాల్యం గడిచింది.అనంతరం జమాల్ కుటుంబం 1981లో కెనడాకు వలస వెళ్లింది.గతంలో తాను పేరు, మతం, చర్మ రంగు ఆధారంగా ఎన్నో సార్లు వేధింపులకు, వివక్షకు గురైనట్లు జమాల్‌ పేర్కొన్నారు.2019 నుంచి ఒంటారియో కోర్టులో అప్పీల్ జడ్జీగా జమాల్ వ్యవహరిస్తున్నారు.

ఇక జస్టిన్ ట్రూడో ప్రభుత్వం లో భారతీయులు కీలక పదవులను దక్కించుకుంటున్న సంగతి తెలిసిందే.కొద్దిరోజుల క్రితం భారత సంతతికి చెందిన ఎంపీ మనీందర్ సిద్ధూని సైతం ప్రధాని ట్రూడో కీలక పదవిలో నియమించారు.అంతర్జాతీయ అభివృద్ధి మంత్రి కరీనా గౌల్డ్‌కు పార్లమెంటరీ కార్యదర్శిగా నియమిస్తూ ప్రధాని ఆదేశాలు జారీ చేశారు.భారత సంతతికే చెందిన కెనడా ఎంపీ కమల్ ఖేరా.గతంలో కరీనా గౌల్డ్ పార్లమెంటరీ కార్యదర్శిగా పనిచేశారు.కరోనా నిబంధనలు ఉల్లఘించినట్లు విమర్శలు రావడంతో ఆమె తన పదవికి రాజీనామా చేశారు.

ఈ నేపథ్యంలో మనీందర్ సిద్ధును పార్లమెంట్ సెక్రటరీగా జస్టిన్ ట్రూడో నియమించారు.అలాగే జస్టిన్ ట్రూడో కేబినెట్‌లో ముగ్గురు ఇండో – కెనడియన్లు చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే.

రక్షణ మంత్రిగా హర్జిత్ సజ్జన్, పబ్లిక్ సర్వీసెస్ అండ్ ప్రొక్యూర్‌మెంట్ మంత్రిగా అనితా ఆనంద్, యువజన శాఖ మంత్రిగా బర్దిష్ చాగర్ విధులు నిర్వర్తిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube