ప్రేమల్లో పడ్డ స్టార్ హీరోయిన్ రష్మిక.. న్యూ లవ్ ఎవరంటే..?

ఛలో సినిమాతో తెలుగు తెరపై ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన్నా తెలుగులో నటించిన సినిమాలలో ఎక్కువ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి.కెరీర్ తొలినాళ్లలో యంగ్ హీరోలకు, మిడిల్ రేంజ్ హీరోలకు జోడీగా నటించిన రష్మిక ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలలో హీరోయిన్ రోల్స్ లో ఎక్కువగా నటిస్తున్నారు.

 Star Heroine Rashmika Mandanna New Love Details Here,latest News,viral Social Me-TeluguStop.com

సినిమాకు 2 కోట్లకు అటూఇటుగా పారితోషికం తీసుకునే ఈ బ్యూటీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతాఇంతా కాదు.

రష్మిక వరుస సినిమా ఆఫర్లతో బిజీగా ఉన్న సమయంలోనే ఆమె ప్రేమలో ఉన్నారనే వార్తలు సైతం గుప్పుమన్నాయి.టాలీవుడ్ యంగ్ హీరోతో రష్మిక ప్రేమలో ఉన్నారని జోరుగా ప్రచారం జరగడం గమనార్హం.అయితే తాజాగా రష్మిక తాను ప్రేమలో ఉన్నానని చెప్పుకొచ్చారు.

ఎవరితో ప్రేమలో ఉన్నారనే విషయాన్ని సైతం రష్మిక సోషల్ మీడియా వేదికగా వెల్లడించడం గమనార్హం.

సాధారణంగా ఎవరైనా ప్రేమలో పడటానికి మూడు సెకన్ల సమయం పడుతుందని తాను మాత్రం కేవలం మూడు మిల్లీ సెకన్లలోనే ప్రేమలో పడ్డానని రష్మిక తన ప్రేమ గురించి చెప్పుకొచ్చారు.

తను పెంచుకుంటున్న పెట్ ఔరాతో ప్రేమలో పడ్డానని రష్మిక వెల్లడించడం గమనార్హం.కరోనా వైరస్ వల్ల ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడినప్పటికీ ఈ సమయంలో కూడా తనకు ఆనందాన్ని ఇచ్చిన లిటిల్ పెట్ ను పరిచయం చేస్తున్నానని రష్మిక చెప్పుకొచ్చారు.

ఔరాకు సంబంధించిన ఫోటోలను రష్మిక నెట్టింట షేర్ చేయగా ఆ ఫోటోలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.మరోవైపు వైరస్ వ్యాప్తి చెందుతున్న సమయంలో కోవిడ్ కేర్ కిట్ లను ఉచితంగా పంపిణీ చేస్తూ ఈ బ్యూటీ గొప్పదనాన్ని చాటుకున్నారు.ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలోని సినిమాలతో బిజీగా ఉన్న రష్మిక మందన్నా తెలుగులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు జోడీగా పుష్ప సినిమాలో నటిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube