జిమెయిల్ లో కూడా కొత్త పాలసీ..?!

ఈ రోజుల్లో జీ మెయిల్ వాడ‌ని వ్య‌క్తులే ఉండ‌రు.ప్ర‌తి ఒక్క‌రికి ఇది నిత్య అవ‌స‌రంగా మారిపోయింది.

 Google New Storage Policy For Gmail , Gmail,new Policy,gmail Update,new Storage-TeluguStop.com

మ‌నం ఎవ‌రికైనా ఏదైనా డాక్యుమెంట్‌గానీ లేదంట రెస్యూమ్‌లాంటివి పంపాలంటే మెయిల్ మాత్ర‌మే గుర్తొస్తుంది.అంత‌లా అది మ‌న‌ల్ని ప్ర‌భావితం చేసింది.

అయితే ఇప్పుడు ఆ మెయిల్‌లో కొన్ని కొత్త నిబంధ‌న‌లు వ‌చ్చాయి.

జీమెయిల్ ఒక కొత్త పాల‌సీని తీసుకొచ్చింది.

ఇకపై జూన్‌ 1 నుంచి గూగుల్‌ స్టోరేజీ పాలసీ మారిపోనుంది.ఇప్పటి నుంచి గూగుల్‌ యాప్స్‌ బ్యాకప్‌ చేసే ఫైల్స్‌ అన్నీ వినియోగదారులకు లభించే 15జీబీ ఉచిత స్టోరేజీ కిందకే రానున్నాయి.

దీని ద్వారా ఇంత‌కు ముందు గూగుల్‌ హై క్వాలిటీ ఫోటోస్‌ బ్యాకప్‌ ఫైల్స్‌ కోసం అన్‌ లిమిటెడ్‌ స్టోరేజీని అందించేది.ఇందులో 15జీబీ వ‌ర‌కు వ‌చ్చేది.

దీంట్లో మ‌నం ఏదైనా స్టోరేజ్ చేసుకోవ‌చ్చు.అయితే ఇప్పుడు ఆ స్టోరేజీ విష‌యంలో మార్పు వ‌చ్చింది.

అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రతి గూగుల్‌ అకౌంట్‌లో డేటాను స్టోర్‌ చేసుకోవడానికి 15జీబీ వరకు ఉచిత స్టోరేజీ లభించేది.

Telugu Gb Storage, Gmail, Google Backups, Google Drive, Google Policy, Googlesto

జీమెయిల్, డ్రైవ్, గూగుల్‌ ఫోటోస్, ఇతర గూగుల్‌ సేవలను ఈ ఫ్రీ జీబీ ద్వారా మ‌నం వాడుకోవ‌చ్చు.కానీ జూన్‌ 1 నుంచి బ్యాకప్‌ చేసుకునే హై క్వాలిటీ ఫోటోలు, వీడియోలు కూడా ఈ 15 జీబీ ఉచిత స్టోరేజీ కిందకే వస్తాయి య‌ని గూగుల్ కొత్త పాల‌సీలో వివ‌రించింది.అంటే జీమెయిల్, డ్రైవ్, గూగుల్‌ ఫోటోస్‌ వంటి అన్ని ఇతర గూగుల్‌ సేవలకు సంబంధించిన డేటా మాత్రమే ఉచితంగా బ్యాకప్‌ చేసుకోవచ్చు.

Telugu Gb Storage, Gmail, Google Backups, Google Drive, Google Policy, Googlesto

అంత‌కు మించి మ‌నం జీబీ స్టోరేజ్ వాడుకుంటే దానికి ఖ‌చ్చితంగా చెల్లింపులు చేయాల్సిందే.

కాబ‌ట్టి ఇప్పుడు స్టోరేజీ త‌క్కువ‌గా ఉంటుంది.దీనికి అనుగుణంగా మ‌న గూగుల్‌ బ్యాకప్‌ లిస్ట్‌లో అనవసరమైన ఫోటోలు, వీడియోలను ఎప్పటికప్పుడు డిలీట్‌ చేసుకోవాలి.

దీని ద్వార మ‌న‌కు స్టోరేజ్ లిమిట్ కాస్త పెరుగుతుంది.https://one.google.com/storage/management లింక్‌ ద్వారా ఈ సేవలను పొందవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube