బుల్లి తెరకు ఉన్న క్రేజ్ ఎంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.వెండితెరకు మించిన వ్యూవర్ షిప్ బుల్లితెర సొంతం.
టీవీల్లో వచ్చే సీరియల్స్ కు తెలుగు రాష్ట్రాల్లోని మహిళలు ఎంత పెద్ద ఫ్యాన్సో చెప్పలేం.సాయంత్రం అయ్యిందంటే చాలు సీరియల్ స్టార్ట్ కావాల్సిందే.
వరుస బెట్టి రాత్రి పది, పదకొండు గంటల వరకు మోత మోగాల్సిందే.అంతలా ఇండ్లలో నాటుకుపోయాయి సీరియల్స్.
ఆడవాళ్లే కాదు.ఈ మధ్య మగవాళ్లకూ సీరియల్స్ పిచ్చి పట్టింది.
కరోనా లాక్ డౌన్ మూలంగా ఇంట్లోనే ఉండి.కుటుంబ సభ్యులంతా కలిసి సీరియల్స్ ను ఎంజాయ్ చేస్తున్నవారు ఎంతో మంది ఉన్నారు.
ఆయా సీరియల్స్ లో నటించే నటీనటులకు ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు.నెంబర్ వన్ కోడలు, ప్రేమ ఎంత మధురం సహా పలు సీరియల్స్ లో నటిస్తున్న హీరోలకు అభిమానులు చాలా ఎక్కువే అని చెప్పుకోవచ్చు.
వెండితెరతో పోటీ పడి మరీ అంతే మొత్తంలో ఆదరణ అందుకుంటున్నారు బుల్లితెర హీరోలు.ఈ ఘనత సాధించడం అంత ఆషామాషీ ఏం కాదు.ఆయా సీరియల్స్ లో నటించే హీరోలు కొందరు బాగా చదువుకున్న వారు ఉన్నారు.మరికొందరు అత్యసరుగా చదివినవారు ఉన్నారు.
సీరియల్స్ లో నటించే ఏ హీరో చదివాడో ఇప్పుడు చూద్దాం.
*చందు గౌడ ఇంజనీరింగ్ పూర్తి చేసి టీవీ రంగంలోకి వచ్చాడు.
*నిరుపమ్ పరిటాల ఎంబీఏ పూర్తి చేసాడు.*శ్రీరామ్ వెంకట్ బీఎస్సీ కంప్లీట్ చేశాడు.
*గోకుల్ బిటెక్ చదుకున్నాడు.*కల్కి రాజా ఎంబీఏ చదివాడు.
*అర్జున్ ఎంసిఏ పూర్తి చేసాడు.*మధుబాబు బిటెక్ చేసాడు.
*రవి కృష్ణ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసాడు.*నిఖిల్ కూడా గ్రాడ్యుయేషన్ చేసాడు.
*శివకుమార్ బిటెక్ కంప్లిట్ చేసాడు.*మధుబాబు కంప్యూటర్ సైన్స్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసాడు.
*జై ధనుష్ బిఎ పూర్తిచేసాడు.*విజె సన్నీ కూడా బీఎస్సీ పూర్తిచేసాడు.
మరికొంత మంది నటులు కూడా బాగానే చదువకుని ఇండస్ట్రీలో అడుగు పెట్టిన వారు ఉన్నారు.