ఆనందం ఫెమ్ 'ఆకాష్ కి ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయో తెలుసా..?

ఆకాష్.తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి హీరో.తన తొలి సినిమా రోజా వనం.ఈ సినిమా యావరేజ్ గా ఆడింది.ఈ సినిమా అనంతరం బాలచందర్ తనను చిరంజీవుడ సినిమాలో సెకెండ్ హీరోగా పెట్టినట్లు చెప్పాడు.ఆ తర్వాత ఆనందం లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేశాడు.

 Anadam Fame Akash Property Details, Akash, Anandam, Roja Vanam, Tollywood-TeluguStop.com

తాజాగా ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది.తను సినిమాల్లోకి రాక ముందే బాగా ఉన్నత కుటుంబం అని చెప్పాడు.

లండన్ లో తనకు సొంతంగా పెట్రోల్ బంక్ ఉందని చెప్పాడు.అటు కుటంబ సభ్యుల మధ్య పొత్తుల మరికొన్ని బంకులు ఉన్నట్లు వెల్లడించాడు.

తాను చిన్నప్పటి నుంచి లండన్ లోనే ఉన్నట్లు చెప్పాడు.అక్కడే ఓ స్కూల్లో తమిళం నేర్చుకున్నట్లు తెలిపాడు.

తన తల్లి తమిళనాడుకు చెందిన వారని చెప్పాడు.వాళ్ల కుటుంబ సభ్యులు టీ పౌడర్ బిజినెస్ చేసే వాడని చెప్పాడు.

వాళ్లు శ్రీలంకలో ఉండేవారని.తాను కూడా శ్రీలంకలోనే పుట్టానని వెల్లడించాడు.

ఆ తర్వాత లండన్ కు వెళ్లినట్లు చెప్పాడు.తన తండ్రి తెలుగు వ్యక్తి అని చెప్పాడు.

తనకు బ్రిటీష్ పాస్ పోర్టు ఉందని వెల్లడించాడు.

అటు ఆనందం సినిమా షూటింగ్ సమయంలో తాను ఇక్కడ గెస్ట్ హౌస్ లో ఉన్నట్లు చెప్పాడు.

తాజ్ హోటల్లో రూం ఇస్తామని ప్రొడ్యూసర్ చెప్పినా.డబ్బులు వేస్ట్ చేయడం ఇష్టం లేక గెస్ట్ హౌస్ లో ఉన్నట్లు చెప్పాడు.

తన దగ్గర పనిచేసే మేకప్ మెన్, అసిస్టెంట్ల బాగోగులు కూడా తానే చూసుకునే వాడినని చెప్పాడు.సినిమాలు తక్కువ డబ్బులు పెట్టి తీయడం మంచి పద్దతి అన్నారు.

ఇస్మార్ట్ శంకర్ సినిమాకు 10 కోట్ల బడ్జెట్ పెట్టడం పట్ల ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.అంత డబ్బు తనకు ఇస్తే దానికంటే మంచి సినిమా చేసే వాడినని వెల్లడించాడు.

చాలా కాలంగా ఆయన సినిమాలకు దూరంగా ఉన్నాడు.మంచి అవకాశాల కోసం వేచి చూస్తున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube