ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హైకోర్టు..!!

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు ఆగిపోయిన సంగతి తెలిసిందే.ఎన్నికలు జరిగినా గాని ఆ సమయంలో ఓటర్ల లిస్టు లో అవకతవకలు జరిగినట్లు అనేక ఆరోపణలు వచ్చాయి.

 Ap High Court Gives Green Signal To Eluru Corporation Election Results , Ap High-TeluguStop.com

సరిగ్గా రేపు ఎన్నికలు జరుగుతాయి అనగా.ఏలూరు ఎన్నికలు నిలిపివేయాలని తీర్పు రాగా తర్వాత కొద్ది.

సమయం తర్వాత ఎన్నికలు నిర్వహించవచ్చని, కానీ కౌంటింగ్ ఆపేయాలని కోర్టు తెలిపింది.అంతమాత్రమే కాకుండా ఆ సమయంలో ఏపీ మంత్రి ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని పేరు కూడా అప్పట్లో ఓటర్ లిస్టులో లేకపోవడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

ఈ నేపథ్యంలో అప్పట్లో హైకోర్టు ఎన్నికలు జరపాలని.కానీ కౌంటింగ్ మాత్రం నిలిపివేయాలని ఆదేశాలు ఇవ్వటంతో ఏలూరు మున్సిపల్ ఎన్నికల ఫలితాలు హోల్డ్ లో పడ్డాయి.దీంతో రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన స్థానిక ఎన్నికలలో ఏలూరు మినహా అన్ని చోట్ల ఫలితాలు వెలువడ్డాయి.పరిస్థితులు ఇలా ఉండగా నేడు తాజాగా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ కి ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన నిబంధనలు పాటించాలని తెలిపింది. 

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube