మోడీ కి లెటర్ రాసిన రాహుల్ గాంధీ..!!

కాంగ్రెస్ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ ప్రధాని మోడీ కి లెటర్ రాశారు.

దేశంలో కరోనా కట్టడి చేయడంలో కేంద్ర ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయిందని పేర్కొన్నారు.

దేశంలో భయంకరంగా వైరస్ విజృంభిస్తున్న కేంద్రానికి పట్టింపులేని విధంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు.వైరస్ పై పోరాటంలో సరైన విధివిధానాలు కేంద్రం వద్ద లేవు అంటూ రాహుల్ గాంధీ లెటర్లో స్పష్టం చేశారు.

అదే విధంగా దేశంలో వ్యాక్సినేషన్ పంపిణీ కార్యక్రమం మరింత వేగవంతం చేయాలని కోరారు.  సరైన సమయంలో లాక్డౌన్ పెట్టలేదని అన్నారు.

మొత్తం మీద దేశంలో ఈ విధంగా వైరస్ వ్యాప్తి చెందటానికి గల కారణం కేంద్ర ప్రభుత్వం యొక్క వైఫల్యమే అన్న తరహాలో కేంద్రంపై సీరియస్ అయ్యారు రాహుల్ గాంధీ.ఇదిలా ఉంటే ప్రస్తుతం దేశంలో గతంలో కంటే ఎక్కువగా వైరస్ కేసులు రోజు రోజుకి పెరుగుతూ ఉన్నాయి.

Advertisement

ఈ నేపథ్యంలో ఆక్సిజన్ కొరత తీర్చుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలు సొంతంగా నిర్ణయాలు తీసుకుంటూ.అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి.

ఈ క్రమంలో చాలా మంది వైద్య ప్రముఖులు దేశంలో లాక్ డౌన్ విధిస్తే గాని పరిస్థితి అదుపులోకి రాదని అంటున్నారు.

Advertisement

తాజా వార్తలు