ఇంటి పట్టు వైద్యమే మంచిదంటున్నా వైద్యులు.. ఎందుకంటే?

ప్రస్తుతం దేశం మొత్తం కరోనా సెకండ్ వేవ్ తో నిండిపోయిందన్న విషయం అందరికి తెలిసిందే.ఇక రోజురోజుకు కేసులు లక్షలసంఖ్యలో పెరుగుతున్న తరుణంలో హాస్పిటల్ లో వైద్య సదుపాయాలు సరిగా అందలేకపోతున్నాయి.

 Home Isolation, Covid Patients, Hyderabad, Hyderabad Private Hospitals Packege,-TeluguStop.com

దీంతో వైద్యులు తాజాగా ఇంటి పట్టు వైద్యమే మంచిదని తెలుపుతున్నారు.కోవిడ్ వస్తే భయపడాల్సిన అవసరం లేదని చెబుతున్నారు.

ఒకవేళ పరిస్థితి తీవ్రంగా అయితే తప్ప ఆస్పత్రులకు రావద్దంటున్నారు.ఇంటి దగ్గరే ఉండి వైద్యం తీసుకోవడం, వాటికి ప్రత్యేకమైన ప్యాకేజీలు కూడా ఉన్నాయంటూ ప్రైవేట్ హాస్పిటల్స్ తెలుపుతున్నాయి.

హైదరాబాదు నగరాలలో ఉన్న పలు హాస్పిటల్స్ రోగి స్థాయిని బట్టి అందుబాటులో సేవలు ఉంటాయని తెలిపారు. అపోలో, యశోద, స్టార్, కేర్ వంటి పెద్దపెద్ద ఆస్పత్రులు ఈ సేవలను అందుబాటులో ఉంచడానికి సిద్ధంగా ఉన్నాయి.ఆస్పత్రిలో బెడ్స్ సదుపాయాలు సరిగ్గా లేకపోయేసరికి ప్రజలు ఇబ్బంది పడకూడదని ఈ ఆలోచనలు తీసుకున్నారు ప్రైవేటు వైద్యులు.

14 రోజులు ఉండే ఈ ప్యాకేజీల గురించి నిపుణులైన డాక్టర్ లచే రోగులకు అవగాహన కల్పిస్తారని తెలిపారు.రోగి తీవ్రత ఎక్కువగా ఉంటే ఆసుపత్రికి తరలించడానికి అంబులెన్స్ సర్వీసులు అందుబాటులో ఈ ప్యాకేజీలో ఉండేటట్లు పొందు పరచనున్నారు.అంతే కాకుండా ప్రతి రోజూ డాక్టర్, రోగి వీడియో కాల్ మాట్లాడే అవకాశాన్ని కూడా అందుబాటులో ఉంచారట.

ఇక ప్యాకేజి ధరలు సామాన్య ప్రజలను దృష్టిలో పెట్టుకొని తమకు అందుబాటులో ధరలు ఉన్నాయట.మొత్తం 14 రోజుల చికిత్స కోసం 20 నుంచి 24 వేల వరకు ఖర్చు అవుతుందని ఆసుపత్రి వర్గాలు తెలుపుతున్నాయి.

ఇక రోగి మానసికంగా దృఢంగా కోల్పోకుండా కౌన్సిలింగ్ వంటివి అందిస్తారని చెబుతున్నారు.ఎలాంటి ఫుడ్ డైట్ గా తీసుకోవాలో కూడా తెలుపుతారట.

కానీ పరిస్థితి తీవ్రంగా ఉంటేనే హాస్పిటల్ కి రావాలని అంటున్నారు.అంతే తప్ప ఇంట్లోనే వైద్య సేవలు అందుకోవాలని తెలుపుతున్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube