శ్రీరాముడు హిందువుల ఆరాధ్య దైవం.దేశవ్యాప్తంగా శ్రీరామచంద్రుని పెద్ద ఎత్తు భక్తి శ్రద్ధలతో పూజిస్తుంటారు.
రామాలయం లేని గ్రామం ఉందంటే ఆశ్చర్యపోవాల్సిందే.ప్రతి ఏటా చైత్ర మాసంలో వచ్చే శ్రీరామనవమి పండుగను తెలుగు ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకుంటారు.
ఈ ఏడాది శ్రీరామనవమి ఎప్పుడు వచ్చింది ఏ సమయం పూజకు అనువైనది అనే విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
శ్రీ రామ నవమి అంటే చాలామంది కేవలం శ్రీ రాముడి కళ్యాణం జరిగిన రోజుగా మాత్రమే భావిస్తారు.
నిజానికి శ్రీ రామ నవమి అంటే సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుడు పుట్టిన రోజు, అయోధ్యకి పట్టాభిషిక్తుడైన రోజుకూడా ఇదే రోజే. చైత్రమాసం శుద్ధ నవమి రోజు జన్మించిన ఈ కౌసల్య పుత్రుడికి భక్తిశ్రద్ధలతో పూజిస్తే చాలు కోరిన కోరికలు నెరవేరుస్తారు.
ఈ ఏడాది శ్రీరామనవమి 2021ఏప్రిల్ 21వ తేదీ వచ్చింది.అయితే పండుగ జరుపుకోవాడానికి సరేనా సమయం మధ్యాహ్నం 12:43 నిమిషాలకు మొదలయ్యి 22వ తేదీ రాత్రి 12:35 గంటలకు ముగుస్తుంది.
శ్రీ రామనవమి రోజు ఉదయం నిద్ర లేచి తలంటు స్నానం చేసి ఆ శ్రీరామునికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.స్వామివారికి పండ్లు, తులసి ఆకులు, పూలను ముఖ్యంగా పానకం, వడపప్పు నైవేద్యంగా సమర్పిస్తారు.
ఈ నవమి రోజు కేవలం శ్రీరాముడు పుట్టిన రోజు మాత్రమే కాకుండా సీతమ్మను వివాహమాడింది కూడా ఈరోజే కావడంతో చాలా చోట్ల ప్రజలు శ్రీరామచంద్రుడికి కల్యాణం జరిపిస్తారు.అదేవిధంగా 14 సంవత్సరాలు అరణ్యవాసం తరువాత అయోధ్యకు రాజుగా పట్టాభిషిక్తుని అయినది కూడా చైత్ర శుద్ధ నవమి రోజే.
కనుక ఈ రోజున దేశవ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలను, ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు.