మూగ జీవాలను మనుషులు తక్కువ అంచనా వేస్తారు.కాని వాటికి ఉన్న అత్యంత శక్తి మానవ మాత్రులకు కొంతమేర ఉన్నా వాటిని పసిగట్టడం లో విఫలమవుతాం.
కాని వారికి ఉన్న అంతర్గత దృష్టి ఆధారంగా అవి ఉన్న చుట్టుప్రక్కల ఏదైనా జరగవచ్చని అనుమానంతో ఆ ప్రమాదం నుండి మనల్ని తప్పించాలని ఉద్దేశ్యంతో కొంచెం ఆవేశంగా ప్రవర్తిస్తుంటాయి.ఇక అప్పుడు వాటిని నియంత్రించడం ఎవరికీ సాధ్యం కాదు.
ఇక అవి చేయాలనుకున్న పని పూర్తి చేశానని, ఆ జంతువు భావిస్తే, మరల అవి సాధారణ స్థితికి చేరుకుంటాయి.ఇటువంటి వాటి జాబితాలో మనం ఎక్కువగా కుక్కలను, ఏనుగులను చూస్తూ ఉంటాం.
అయితే ఏనుగు ఓ అడవిలో కొందరు వ్యక్తులపై ఒక్కసారిగా వచ్చి విరుచుకబడిన ఘటన ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.ఆ అడవిలోకి ఖడ్గ మృగాల వేట కోసం ముగ్గురు వ్యక్తులు ప్రవేశించారు.
అయితే వారు ఏదో తేడాగా ఉన్నట్లు ఏనుగుకు అనుమానం వచ్చి అడవిలోకి ఆ వ్యక్తులను వెంబడించి ఒకరిని దాడి చేసి తొక్కి చంపినట్లు తెలుస్తోంది.ఇక ఈ ఘటనతో అప్రమత్తమైన అటవీ సిబ్బంది ఏనుగును మరల వేరే చోటుకి తరలించారు.
ఈ వార్త నెట్టింట్లో వైరల్ అవుతోంది.స్మగ్లర్లకు ఏనుగు సరిగ్గా బుద్ధి చెప్పిందంటూ నెటిజన్ల కామెంట్స్ తో ఈ వార్త మరింత వైరల్ గా మారుతోంది.