ప్రపంచాన్ని ఉర్రూతలు ఊగించే క్రికెట్.ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపింది.నిరుపేద కుటుంబాల నుంచి వచ్చిన క్రికెటర్లు.అంతర్జాతీయ జట్టులో స్థానం సంపాదించుకుని ఓవర్ నైట్ స్టార్లుగా ఎంతో మంది మారారు.విలాసవంతమైన జీవితం.డబ్బుకి డబ్బు, పేరుకి పేరు పొందారు.
కానీ కొన్నిదేశాల క్రికెటర్లు అద్భుతంగా రాణించినా.పెద్దగా ఫలితం ఉండదు.
ముఖ్యంగా జింబాబ్వే, వెస్టిండీస్, శ్రీలంక వంటి దేశాల్లో క్రికెటర్ల పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది.అంతర్జాతీయ జట్టుకు ఆడినా పెద్దగా ఒరిగేది ఏమీ ఉండదు.
అందుకే క్రికెట్ ను వదిలి ఆయా పనులు చేసుకుంటున్నారు పలువురు క్రికెటర్లు.
శ్రీలంక మాజీ స్పిన్నర్, చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు సూరజ్ రణదీవ్ పరిస్థితి సేమ్ ఇలాంటిదే.
అంతర్జాతీయ క్రికెట్ లో బాగానే రాణించినా.అతడి జీవితంలో పెద్దగా మార్పు ఏమీ రాలేదు.పేరు వచ్చినా డబ్బు మాత్రం రాలేదు.2011 ప్రపంచ కప్ ఫైనల్లో శ్రీలంక తరుపున సూరజ్ ఆడాడు.అయినా సరిగా డబ్బు రాకపోవడంతో కుటుంబాన్ని పోషించేందుకు క్రికెట్ నుంచి తప్పుకుని బస్ డ్రైవర్ గా ఆస్ట్రేలియాలో జీవిస్తున్నాడు.అతడితో పాటు మరో మాజీ శ్రీలంక క్రీడాకారిణి చింతాకా నమస్తే కూడా బస్ డ్రైవర్ గానే పని చేస్తుంది.
శ్రీలంక టీంకు కెప్టెన్ గా చేసిన సూరజ్ రణదీవ్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది.36 ఏళ్ల రణదీవ్ 12 టెస్టులు, 31 వన్డేలు, 7 టి 20 లలో తన దేశానికి ప్రాతినిధ్యం వహించాడు.అతను టెస్టుల్లో 43 వికెట్లు, వన్డేల్లో 36 వికెట్లు తీశాడు.టెస్టులు, వన్డేల్లో ఒక్కోసారి 5 వికెట్లు పడగొట్టాడు.ఐపిఎల్ లో ధోనీ టీంలో ఆడాడు.బోర్డర్-గవాస్కర్ సిరీస్ 2020-21 కోసం ఆస్ట్రేలియా అతడిని వాడుకునే ప్రయత్నం చేసింది.
ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ కు స్పిన్ లో శిక్షణ ఇవ్వడానికి అతడిని క్రికెట్ ఆస్ట్రేలియా నెట్ బౌలర్ గా పిలిచింది.అతడు కూడా డబ్బులేక పేదరికాన్ని గడుపుతున్నాడు.
వీళ్లేకాదు.మాజీ జింబాబ్వే క్రికెటర్ వాడింగ్టన్ మ్వెంగా కూడా ఆస్ట్రేలియా కు వలస వచ్చాడు.
బస్సు డ్రైవరుగా జీవితం గడుపుతున్నాడు.ఇంకా పలువురు క్రికెటర్ల పరిస్థితి ఇలాగే ఉంది.
వీళ్లు భారత్ లో పుట్టి ఉండే పరిస్థితి వేరేలా ఉండేది.