వరుసగా ఐదు హిట్ సినిమాలతో టాలీవుడ్ లో స్టార్ దర్శకుడుగా తనకంటూ బ్రాండ్ క్రియేట్ చేసుకున్న టాలెంటెడ్ కమర్షియల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి.ప్రేక్షకుడికి కావాల్సిన వినోదం, హీరోయిజం మిక్స్ చేసి పక్కా కమర్షియల్ ఫార్ములాతో సినిమాలు చేస్తున్న ఈ దర్శకుడు తాను చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక ట్రెండ్ మార్క్ డైలాగ్ ఉండేలా చూసుకుంటున్నాడు.
ఈ కారణంగా ఆ ట్రెండ్ మార్క్ డైలాగ్స్ కూడా అతని సినిమాల సక్సెస్ కి కారణం అవుతున్నాయి.అనిల్ రావిపూడి సినిమాలలో కథ ఏముంటుంది అంటే రొటీన్ అని చెప్పిన కూడా ప్రెజెంటేషన్, కామెడీలో కొత్తదనం ఉందని మాత్రం ప్రతి ఒక్క ప్రేక్షకుడు చెబుతూ ఉంటాడు.
ఇక కుర్ర హీరోల నుంచి స్టార్స్ వరకు అందరూ ఈ ఒక్క కారణంతోనే అనిల్ రావిపూడితో సినిమాలు చేయడానికి ఇష్టపడుతున్నారు.అనిల్ తో సినిమా చేస్తే ఫ్రెష్ ఫీలింగ్ వస్తుందనే అభిప్రాయంతో ఉంటున్నారు.
ఇదిలా ఉంటే అనిల్ రావిపూడి ప్రస్తుతం ఎఫ్2 సీక్వెల్ గా ఎఫ్3 మూవీతెరకెక్కిస్తున్నారు.ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.అయితే ప్రస్తుతం కరోనా బారిన పడటంతో షూటింగ్ కాస్తా వాయిదా పడింది.ఇదిలా ఉంటే అనిల్ రావిపూడి నెక్స్ట్ సినిమా కోసం అప్పుడే హీరోని ఫైనల్ చేసుకున్నాడు.
నిజానికి ఎఫ్3 తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేయాల్సి ఉంది.అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ సడెన్ గా ఆ లైన్ లోకి రావడంతో వెంటనే హీరో రామ్ కి కథ చెప్పి అనిల్ ఒకే చేయించుకున్నట్లు తెలుస్తుంది.
ఇక ఈ సినిమాని కూడా దిల్ రాజు నిర్మించే అవకాశం ఉందని బోగట్టా.త్వరలో దీనికి సంబంధించి వివరాలు తెలిసే అవకాశం ఉందని సమాచారం.