శ్రీ చక్రం ఏ విధంగా పూజించాలి... ఎలాంటి ఫలితాలు కలుగుతాయి..!

మన హిందూ ఆచారాల ప్రకారం ఎక్కువగా యంత్రాలను కూడా పూజిస్తుంటారు.వాటిలో , శ్రీ చక్ర యంత్రం లాంటి మొదలైన యంత్రాలను పెద్ద ఎత్తున పూజిస్తుంటారు.

ఈ యంత్రాలలో శ్రీచక్రం ఎంతో మహిమ గలదని, ఈ యంత్రాన్ని మన ఇంట్లో ఉంచుకొని నిత్యం పూజలు చేయటం వల్ల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భావిస్తుంటారు.అదే విధంగా ఈ చక్రం మన ఇంట్లో ఉంచడం వల్ల మన ఇంటి పై ఎలాంటి ప్రభావం ఉండదని పండితులు చెబుతుంటారు.

అయితే ఇంతటి మహిమగల శ్రీచక్రాన్ని ఏ విధంగా పూజించాలి? ఈ చక్ర యంత్రాన్ని పూజించడంవల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం.శ్రీ చక్ర యంత్రం ఎప్పుడు కూడా రాగి పలక పై తయారు చేసినది మాత్రమే మన ఇంట్లో ఉంచుకోవాలి.

ఎటువంటి పరిస్థితులలో కూడా పంచలోహాలతో తయారు చేసిన యంత్రాన్ని మన ఇంట్లో పూజించకూడదు.రాగి పలకతో తయారు చేసిన ఈ యంత్రాన్ని పూజగదిలో ఉంచుకొని ప్రతిరోజు పూజ చేయాలి.

Advertisement

ప్రతి శుక్రవారం ఈ శ్రీ చక్ర యంత్రాన్ని పాలతో అభిషేకం చేసి ఆ తర్వాత నీటితో శుద్ధి చేయాలి.ఆ తర్వాత అమ్మవారి స్తోత్రాలు చదువుతూ గంధం, కుంకుమ, అక్షింతలు వేస్తూ అమ్మవారి స్తోత్రాలు చదువుతూ పూజించాలి.

శ్రీ చక్ర యంత్రాన్ని పరమపవిత్రంగా భావించే పూజ చేయడం వల్ల ఎలాంటి ఆపదలో ఉన్న ఆ సమస్య నుంచి విముక్తి కలిగిస్తుంది.శ్రీచక్రం ఆధ్యాత్మికంగా, శారీరక ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడుతుంది.శక్తి గల యంత్రాలలో శ్రీ చక్ర యంత్రం ఎంతో పవిత్రమైనది.

ఈ శ్రీ చక్రం ఇంట్లో ఉండటం వల్ల మన ఇంటిలోకి ఎలాంటి దృష్టశక్తులు ప్రవేశించవు.ఈ శ్రీ చక్ర యంత్రాన్ని కేవలం ఇంట్లో మాత్రమే కాకుండా వ్యాపార రంగాలలో, మనం పని చేసే ఆఫీసులో కూడా ఉంచుకోవచ్చు.

అయితే ఈ శ్రీ చక్ర యంత్రాన్ని ఉంచే ప్రదేశం ఎల్లప్పుడు శుభ్రంగా ఉండాలి.ఈ విధంగా శ్రీ చక్ర యంత్రాన్ని పూజించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగి పోయి, అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి.

పోలింగ్ ఏజెంట్ల నియామకంపై ఈసీ ఆదేశాలు
తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?

అదేవిధంగా మానసిక ప్రశాంతత కూడా చేకూరుతుందని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు