ఒకే లింగంలో దర్శనమిచ్చే త్రిమూర్తుల ఆలయం ఎక్కడుందో తెలుసా..!

సృష్టి, స్థితి, లయకారకులుగా బ్రహ్మ ,విష్ణు, మహేశ్వరులను పూజిస్తాము.అయితే ఈ ముగ్గురు కూడా వేరువేరు ఆలయాలలో ప్రత్యేక పూజలతో పూజిస్తాము.

 Do You Know Where The Temple Of The Trimoortulu That Appears In The One Lingam I-TeluguStop.com

కానీ సృష్టికర్త అయిన ఈ ముగ్గురు త్రిమూర్తులను కలిసి ఒకే ఆలయంలో, ఒకే లింగం పై దర్శనమివ్వడం మనం తమిళనాడులో చూడవచ్చు.ఇంత అద్భుతమైన ఈ త్రిమూర్తుల దర్శన ఆలయం గురించి ఇక్కడ తెలుసుకుందాం…

పవిత్రమైన 108 శైవ క్షేత్రాలలో సుచింద్రం ఒకటి.

ఈ ఆలయంలో కేవలం శైవులు మాత్రమే కాకుండా వైష్ణవులు కూడా పెద్ద ఎత్తున స్వామివారిని దర్శించుకుంటారు.తమిళనాడులోని కన్యాకుమారి దగ్గరగా ఉన్న సుచింద్రం ఉంది.

స్థాణుమలయన్‌ ఆలయంలోని గర్భగుడిలో ఒకే లింగంలో…  పై భాగంలో శివుడు,  మధ్య భాగంలో విష్ణువు, కింది భాగంలో బ్రహ్మ ఈ ముగ్గురు మనకు దర్శనం కల్పిస్తారు.స్థాణు’ అంటే శివుడు, ‘మల్‌’ అంటే విష్ణువు, ‘అయన్‌’ అంటే బ్రహ్మ.

ఈ ముగ్గురి పేర్ల మీదుగానే ఆలయానికి ఆ పేరు వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి.

Telugu Brahma, Kanyakumari, Lingam, Temple, Shiva, Suchindram, Tamilnadu, Vishnu

ఈ విధంగా త్రిమూర్తులు కలిసి ఒకే లింగంపై దర్శనం ఇవ్వడానికి కారణం ఉందని పురాణాలు చెబుతాయి.పూర్వం అనసూయ దేవిని పరీక్షించడానికి వచ్చిన త్రిమూర్తులు ముగ్గురిని అనసూయ దేవి తన పాతివ్రత్య ప్రభావంతో ఈ ముగ్గురు చిన్నపిల్లలుగా మారిపోతారు.అయితే లక్ష్మీ, పార్వతి, సరస్వతి అనసూయ దేవిని వేడుకొనగా వారికి విముక్తి కల్పించిందని ఆ సమయంలో త్రిమూర్తులు ముగ్గురు స్వయంభుగా ఒకే లింగంపై వెలిశారని పురాణాలు చెబుతాయి.

అదేవిధంగా ఏ ఆలయంలో కనిపించనటువంటి ఇరవై ఆరు ముఖాలు, 52 చేతులు కలిగి ఉన్న శివుడి శిల్పం ఈ ఆలయంలో మనకు దర్శనమిస్తుంది.అదేవిధంగా ఇరవై రెండు అడుగులు ఎత్తు కలిగిన హనుమంతుని విగ్రహం కూడా ఈ ఆలయంలో మనం దర్శించుకోవచ్చు.

ఇక్కడ ఆంజనేయుడికి సింధూరాని కి బదులుగా వెన్నతో స్వామివారికి పూజ చేస్తారు.లంకాదహనం జరిగిన సమయంలో ఆంజనేయ తోక అంటుకోవడం వల్ల చల్లదనం కోసం తోక పై వెన్న వ్రాయడం వల్ల స్వామివారు అనుగ్రహిస్తారని ఇక్కడ భక్తులు విశ్వసిస్తారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube