వరంగల్ జిల్లాలో ఉద్రిక్త వాతావరణం బీజేపీ కార్యాలయానికి నిప్పు..!! 

హనుమకొండ టిఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అయోధ్యలో నిర్మాణం జరుగుతున్న రామాలయం పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.రాముడిని అడ్డంపెట్టుకుని రాజకీయాలలో విరాళాలు సేకరిస్తూ పొలిటికల్ మైలేజ్ సంపాదించుకోవటానికి బిజెపి తాపత్రయపడుతోంది అంటూ ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల బిజెపి పార్టీ నేతలు ఆయన ఇంటిపై దాడి చేయడం అందరికీ తెలిసిందే.

 Bjp-office-on-fire-in-warangal-districthanumakonda,warangal,bjp,trs,ts Ts Poltic-TeluguStop.com

దీంతో దాడిని నిరసిస్తూ వరంగల్ రూరల్ జిల్లా పరకాల లోని బీజేపీ కార్యాలయానికి కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడం జరిగింది.అంతే కాకుండా ఆ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేయడం జరిగింది.

ఈ ఘటనలో కార్యాలయం అద్దాలు ధ్వంసం చేయడమే గాక భారీ స్థాయిలో లోనా డ్యామేజ్ అయ్యేలా నిప్పంటించారు.ఇదే రీతిలో  బిజెపి పార్టీకి చెందిన వ్యాపారాలపై కూడా దాడి చేస్తామని బెదిరింపులకు దిగారు.

దీంతో ఇప్పుడు వరంగల్ జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది.దాడికి గురైన బిజెపి కార్యాలయం వద్ద భారీ స్థాయిలో బిజెపి పార్టీ నేతలు మరియు కార్యకర్తలు వస్తున్నారు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube