బీహార్ లో మోడీ మంత్రాంగానికి బ్రేకులు..!

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ మంత్రాంగానికి బ్రేకులు ప‌డుతున్నాయా?  తొలిసారి ఆయ‌న వ్యూహం ఫ‌లించేలా క‌నిపించ‌డం లేదా? అంటే.ఔన‌నే అంటోంది.

 Bihar People Shock To Pm Modi, Youth Leader Tejaswi, Narendra Modi, Delhi Politi-TeluguStop.com

లోక్‌నీతి-సీఎస్ డీఎస్ సంస్త నిర్వహించిన స‌ర్వే.ప్ర‌స్తుతం అత్యంత కీల‌క‌మైన బీహార్ ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి.

మొత్తం మూడు ద‌శ‌ల్లో నిర్వ‌హించే ఎన్నిక‌ల్లో 243 అసెంబ్లీ స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి.అయితే, ఎలాగైనా ఇక్క‌డ అధికారం చేజిక్కించుకునేందుకు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ సార‌ధ్యంలోని బీజేపీ వ్యూహాత్మ‌కంగా పావులు క‌దిపింది.

ఇక్క‌డ నితీష్ కుమార్ నేతృత్వంలో బీజేపీ చేతులు క‌లిపింది.అంటే.నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ.బీజేపీలు క‌లిసి పోటీ చేస్తున్నాయి.

అదేస‌మ‌యంలో ఈ కూట‌మిలోనే నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఉన్న రాం విలాస్ పాశ‌వాన్ పార్టీ ఎల్ జేపీని వ్యూహాత్మ‌కంగా బీజేపీ బ‌య‌ట‌కు పంపేసింది.అంటే.

లాలూ ప్ర‌సాద్ యాదవ్‌కుమారుడు, సీఎం అభ్య‌ర్థిగా ఉన్న తేజ‌స్వి దూకుడుకు చెక్ పెట్టాల‌ని బీజేపీ నిర్ణ‌యించుకుంది.ఎల్ జేపీ కార‌ణంగా ఆర్జేడీ ఓట్లు చీలిపోయి.

త‌మ‌కు లభిస్తుంద‌న్న‌ది మోడీ వ్యూహం.
అదే స‌మ‌యంలో నితీష్ కుమార్ ఇమేజ్ త‌మ‌కు ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని అనుకున్నారు.

కానీ.తాజాగా లోక్‌నీతి-సీఎస్ డీఎస్ నిర్వ‌హించిన ఒపీనియ‌న్ పోల్ స‌ర్వేలో తేజ‌స్వి వైపే బీహారీలో మొగ్గు క‌నిపించింది.

అదేస‌మ‌యంలో మోడీ జెండా అయినా ఎన్డీయేను గ‌ట్టెక్కిస్తుంద‌ని ఆశించిన నితీష్‌కు సొంత ప్ర‌భే కూలిపోయింది.ఆయ‌న పోయి పోయి .మోడీతో జ‌ట్టుక‌ట్ట‌డాన్ని బీహారీలు ఒప్పుకోవ‌డం లేదు.పైగా యువ నాయ‌కుడు తేజ‌స్వి వైపు యువత గ్రామీణ ప్ర‌జ‌లు ఎక్కువ‌గా ఉన్నార‌ని పోల్ స‌ర్వే తేల్చేసింది.
దీంతో మోడీ వ్యూహం దెబ్బ‌తింద‌నే క‌థ‌నాలు వ‌స్తున్నాయి.కాగా, ఈ నెల 23 నుంచి మోడీనే ఏకంగా ఎన్నిక‌ల ప్ర‌చారం లో దిగుతున్నారు అయినప్ప‌టికీ.త‌న తండ్రిని అన్యాయంగా జైల్లో పెట్టార‌న్న తేజ‌స్వికి వ‌స్తున్న సానుభూతి ముందు మోడీ మంత్రాంగం ప‌నిచేయ‌డం క‌ష్ట‌మేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు .మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube