అతికిన, బతికిన అంటూ ఆసక్తికర ట్వీట్ చేసిన బ్రహ్మాజీ!

ఇప్పుడు ఏం మాట్లాడిన కరోనానే ఎక్కడ చుసిన కరోనానే.ఇంకా అలాంటి కరోనా వైరస్ ఇప్పట్లో తగ్గేలా లేదు.

 Actor Brahmaji, Tweets, Athikina Rojullo, Brathikina Rojullo, Brahmaji Tweets-TeluguStop.com

అలానే కరోనా వైరస్ మనుషుల జీవన శైలిని మార్చేసింది.ఎంత ప్రేమ ఉన్న ఎంత అనుబంధం ఉన్న ఎంత గౌరవం ఉన్న సరే షేక్ హ్యాండ్ ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది.

ఇంకా అలాంటిది పక్కన కూర్చొని మాట్లాడటం, నవ్వడం కలిసి భోజనాలు చెయ్యడం వంటివి అన్ని పూర్తిగా బంద్ అయ్యాయి.ఇప్పట్లో ఆ పని ఎవరు చెయ్యలేరు.ఇంకా చెప్పాలి అంటే ఇప్పుడు ప్రజలంతా కూడా ఇళ్లకే పరిమితం అయ్యారు.ఇంకా బయటకు వచ్చిన మాస్క్ ధరించాలి, సోషల్ డిస్టెన్స్ పాటించాలి.

ఇది పరిస్థితి.

Telugu Brahmaji, Brahmaji Tweets, Tweets-

ఈ పరిస్థితిపై ఇప్పటికే సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు జోకులు కూడా వేశారు.ఇంకా ఈ నేపథ్యంలోనే ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయ్ అనేదానిపై సినీ నటుడు బ్రహ్మాజీ ట్విట్టర్ వేదికగా కామెడీ చేశారు.”ఒకప్పుడు బాగా దగ్గరగా బతికిన రోజుల్లో”, ”బాగా అతికిన రోజుల్లో” అంటూ కొన్ని ఫొటోలు షేర్ చేశాడు.ఆ ఫొటల్లో రవితేజ, సుబ్బరాజు, డైరెక్టర్లు హరీశ్ శంకర్, మెహర్ రమేశ్, బీవీఎస్ రవిలతో కలసి పార్టీ చేసుకున్న ఫొటో ఒకటి పోస్ట్ చెయ్యగా, మరో ఫోటో ”సర్దార్ గబ్బర్ సింగ్” షూటింగ్ సమయంలో పవన్ కల్యాణ్, రామ్ చరణ్, సాయితేజ్, అలీతో కలిసి దిగిన మరో ఫొటోను షేర్ చేశాడు.దీంతో ఈ ట్విట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube