ప్రతి సంక్రాంతికి నందమూరి బాలకృష్ణ తన సినిమాను విడుదల చేస్తూ వస్తున్నాడు.సంక్రాంతి పండగ అంటే నందమూరి అభిమానులది అనే విధంగా బాలకృష్ణ సినిమాలు సంక్రాంతికి విజయం సాదిస్తూ వస్తున్నాయి.
అలాగే నందమూరి అభిమానులు కూడా బాలకృష్ణ సినిమా కోసం ఎదురుచూస్తూ ఉంటారు.కానీ ఈ సారి బాలకృష్ణ అభిమానులకు మాత్రం నిరాశే మిగిలేలగా ఉన్నది.
తమిళ దర్శకుడు కేఎస్ రవి కుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ కథానాయకుడిగా ఓ చిత్రం రూపొందుతుంది.ఈ చిత్రం దాదాపుగా షూటింగ్ పూర్తి చేసుకుంది.
బాలకృష్ణ సరసన సోనాలి చౌహాన్… వేదిక కథానాయకిలుగా నటిస్తున్నారు.దర్శకుడు ఈ చిత్రాని యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిస్తున్నాడు.ఈ చిత్రాని సంక్రాంతికి విడుదల చేద్దాం అనుకున్న బాలకృష్ణ కు మాత్రం నిరాశే మిగిలింది.దీనికి కారణం కూడా లేకపోలేదు.ఈ సంక్రాంతికి మహేష్ సినిమా సరిలేరు నికేవ్వరు.అల్లు అర్జున్ అలా వైకుంటపురంలో సినిమాలు సంక్రాంతికి విడుదలకు సిద్దం గా ఉన్నాయి.
తెలుగు సినిమాలతో పాటుగా తమిళ సినిమాలు కూడా సంక్రాంతికి పోటి పడుతున్నాయి.విజయ్ నటించిన బిగిల్, సూపర్ స్టార్ రజినీకాంత్ దర్బార్ సినిమాలు ఈ సంక్రాంతికి విడుదల అవుతున్నాయి.
ఈ సంక్రాంతికి పోటి ఎక్కువగా ఉండటంతో బాలకృష్ణ తన సినిమాను డిసెంబర్ ౩వ వారంలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వెళ్ళాలని బాలకృష్ణ బావిస్తున్నట్లు సమాచారం.అతి త్వరలోనే సినిమా విడుదల తేదిని చిత్ర బృందం ప్రకటించనున్నది.