హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ గురించి తెలియని వారంటూ ఉండరు.ఆయన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు.
ఆర్నాల్డ్ సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు.ఇక ఆయనకీ తగ్గట్టుగానే సినిమాలన్నీ కూడా దాదాపుగా భారీ బడ్జెట్ తోనే తెరకెక్కిస్తూ ఉంటారు.
ఇక ఆర్నాల్డ్ నటించినా అంటువంటి చిత్రాల్లో టెర్మినేటర్ – 2 జడ్జిమెంట్ డే చిత్రం ఆర్నాల్డ్ కి ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపుని తీసుకొచ్చింది.అంతేకాదు.ఈ చిత్రం దర్శక నిర్మాతలకు కూడా మంచి విజయంతో పాటు, కాసుల వర్షం కూడా కురుపించింది.ఈ సినిమాతో దర్శక నిర్మాతలకు లాభాల పంట పండింది అనే చేప్పాలి మరి.
అంతేకాదు.ఈ చిత్రానికి సంబంధించి నటువంటి కొన్ని అంశాలను ప్రస్తుతం నేట్టింట్లో వైరల్ గా మారాయి.
ఇక ఈ సినిమాలో హీరోగా ఆర్నాల్డ్ తన పాత్రకి 100 శాతం న్యాయం చేశారు.అంతేకాక.ఈ చిత్రానికి ఆర్నాల్డ్ నటన హైలెట్ గా నిలిచింది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

కాగా.ఈ సినిమాలో నటించడానికి ఆర్నాల్డ్ దాదాపుగా 15 మిలియన్ డాలర్లు పారితోషకం తీసుకున్నారంట.అయితే ఈ చిత్రంలో ఆర్నాల్డ్ దాదాపుగా ఈ ఏడు వందల పదాలను మాట్లాడరంట.
అయితే ఇందుకుగాను అప్పట్లో ఒక్కో పదానికి 21 వేల పైచిలుకు డాలర్లను తీసుకున్నట్లు తెలుస్తోంది.అయితే మన భారత దేశ కరెన్సీలో అయితే దాదాపుగా 15 లక్షల రూపాయల పైనే ఉంటుందని సమాచారం.

కాగా.దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు ఆర్నాల్డ్ కి హాలీవుడ్లో ఎంత క్రేజ్ ఉందో ఇక్కడే తెలిసిపోతుంది.ఇక ఆర్నాల్డ్ అంత పారితోషికం తీసుకున్నప్పటికీ ఆ మొత్తాన్ని ప్రజా సమస్యల కోసమే వినియోగించారంట.ఆయన చేస్తున్నటువంటి సేవలను గుర్తించిన అప్పటి ప్రభుత్వం అమెరికాలోని కార్నిపోరియా నగరానికి గవర్నర్ గా నియమించారు.
ఆయన ఒక్కవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు గవర్నర్ గా తన బాధ్యతలను నిర్వహించారు.