కంప్యూటర్ల కాలం వచ్చాక పాస్ వర్డ్స్ ప్రాధాన్యం ఎంతో పెరిగిపోయింది.ఆన్ లైన్లో తమ స్వంత వివరాలను భద్రపరచుకొనేందుకు, బ్యాంకులు వగైరా కార్యకలాపాలు నిర్వహించేందుకు ఎవ్వరూ కనిపెట్టలేని పాస్ వర్డ్స్ పెట్టుకోవాలంటూ ఎప్పటికప్పుడు హెచ్చరికలు వస్తూనే ఉంటాయి.
ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎంతో మంది అకౌంట్లు హాక్ అవుతూనే ఉన్నాయి.దానికి కారణం కూడా మీరే.
ఎందుకంటే మీ అకౌంట్ సెక్యూరిటీ అయిన పాస్ వర్డ్ అనేది బలహీనంగా ఉండటం.ప్రపంచవ్యాప్తంగా 80శాతం మంది వీక్ పాస్ వర్డ్స్ పెడుతున్నారంట.
అందులో కొన్నింటిని సెక్యూరిటీ సంస్థలు విడుదల చేశాయి.
చెత్త పాస్వర్డ్స్ లిస్ట్ ఒక లుక్ వేసుకోండి.
12345, 1234567, 12345678, 654321, 987456, 456789 ఫుట్ బాల్, వాలీబాల్, క్రికెట్, వెల్ కమ్, మంకీ, లాగిన్, పాస్ వర్డ్, abc123, స్టార్ వార్స్, 123123, డ్రాగన్, మాస్టర్, హలో, ప్రీడం, వాటెవర్, blahblah, computer, tigger, hunter, sunshine,
కొందరు అయితే వారి పేర్లలోనే పాస్ వర్డ్ పెట్టటమే కాకుండా.తల్లి, దండ్రుల పేర్లను సెక్యూరిటీగా ఇస్తున్నారు.
కీబోర్డ్ పై ఉండే అక్షరాలను వరసగా ఇస్తున్నారు.మరికొందరు తమ పుట్టినరోజులనే పాస్ వర్డ్స్ గా పెట్టేస్తున్నారు.
ఇది చాలా డేంజర్ అంటున్నారు విశ్లేషకులు.
రెజ్యూమ్ అన్నీ సోషల్ మీడియాలో అప్ డేట్ చేసి ఉంటారు కదా అందులో నుంచి తీసుకుంటారు.
మీ ఫేస్ బుక్ లో మీకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు షేర్ చేసుకోవటంతోపాటు.మీ బయోడేటాలో కూడా ఇవన్నీ రాసి ఉంటారు.దీంతో హ్యాకర్స్ ఈజీగా మీ పాస్ వర్డ్స్ ను కనిపెట్టేస్తున్నారని స్ప్లాష్ డేటా అనే సెక్యూరిటీ సంస్థ వెల్లడించింది.ఇకనైనా జాగ్రత్త పడండి.