స్టూడియోలను స్వాదీనం చేసుకోవాలనుకుంటున్న కేసీఆర్‌??

తెలుగు సినిమా పరిశ్రమ మొదట్లో చెన్నైలో ఉండేది.అక్కడ నుండి హైదరాబాద్‌కు రప్పించేందుకు అప్పటి ప్రభుత్వం చాలా ప్రయత్నాలు చేసింది.

 Big Producer Refused Kcrs Proposal-TeluguStop.com

ఎక్కువ శాతం మంది అప్పట్లో ఆసక్తి చూపించలేదు.కాని రామానాయుడు మరియు అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ వంటి వారు హైదరాబాద్‌కు వచ్చేందుకు మొదట ఆసక్తి చూపించారు.

వారికి తక్కువ రేటుకు అప్పట్లో భూములు మరియు అనుమతులు ఇచ్చి స్టూడియోల నిర్మాణంకు అనుమతులు ఇవ్వడం జరిగింది.ఇప్పుడు అవే రామానాయుడు స్టూడియో, అన్నపూర్ణ స్టూడియోలుగా వెలుగు వెలుగుతున్నాయి.

ఇంకా ఆ సమయంలోనే రెండు మూడు స్టూడియోల నిర్మాణం జరిగింది కాని వాటికి పెద్దగా ప్రాచుర్యం దక్కలేదు.

హైదరాబాద్‌ నడిబొడ్డున నిర్మాణం జరిగిన రామానాయుడు మరియు అన్న పూర్ణ స్టూడియోలు వందల ఎకరాల్లో ఉన్నాయి.

ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ భూములపై దృష్టి పెట్టినట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది.ఆ రెండు స్టూడియోలను స్వాదీనం చేసుకుని ప్రజా మరియు ప్రభుత్వ అవసరాలకు అందులో పెద్ద భవనాలను నిర్మించాలని కేసీఆర్‌ ప్రభుత్వం భావిస్తుంది.

అందుకే ఇటీవలే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున ముగ్గురు ఐపీఎస్‌ల బృందం ఆ రెండు స్టూడియోల అధినేతలను కలవడం జరిగింది.

నగరం మద్యలో ఉన్న మీ స్టూడియోను ప్రభుత్వంకు ఇచ్చేస్తే అందుకు గాను నగర శివారు ప్రాంతంలో రెట్టింపు స్థలం మరియు స్టూడియో నిర్మాణంకు కావాల్సిన మౌళిక వసతులు కల్పిస్తాం అంటూ స్టూడియోల అధినేత వద్ద విన్నవించినట్లుగా తెలుస్తోంది.స్టూడియో స్థలాలను ఇచ్చిన నేపథ్యంలో మీకు మరింత లాభం చేకూరేలా ప్రభుత్వం చూసుకుంటుందని ఆ రెండు స్టూడియోల అధినేతలను ఒప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.ప్రస్తుతం నగరంలో చిత్రీకరణ జరపాలి అంటే ఈ రెండు స్టూడియోలనే ఎక్కువగా సినీ వర్గాల వారు ఆశ్రయిస్తారు.

భారీ ఎత్తున లాభాలు వస్తున్న ఈ స్టూడియోలను ఎందుకు తాము వదులుకుంటాం అంటూ వారు అంటున్నారు.

ఇతర ప్రాంతాల్లో రెట్టింపు స్థలం ఇచ్చినా, లేదంటే విలువ కట్టించి ఇచ్చినా కూడా తాము మాత్రం తమ స్టూడియోలను ప్రభుత్వంకు అప్పగించలేం అంటూ వారిద్దరు చెప్పుకొచ్చారు.

స్టూడియోలో తమ తండ్రి జ్ఞాపకాలు ఉన్నాయని, ఆయన ఎంతో ఇష్టపడి నిర్మింపజేసుకున్న స్టూడియోను ప్రభుత్వంకు అప్పగిస్తే ఎలా అనుకుంటున్నారు.అందుకే నష్టాలు వచ్చినా, లాభాలు రాకున్నా కూడా తమ స్టూడియోలను కొనసాగించాలనే నిర్ణయంతో వారు ఉన్నారు.

బలవంతంగా తీసుకునేందుకు ప్రయత్నిస్తే కోర్టుకు వెళ్లేందుకు కూడా వారు సిద్దపడే అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube