సముద్రంలో షిప్పు శిథిలాలు.. అందులో ఏం దొరికిందో తెలిస్తే..?

రీసెంట్‌గా పోలండ్ దేశానికి( Poland ) చెందిన కొంతమంది డైవర్లు సముద్రంలోకి వెళ్లి, ఎవరూ ఊహించని ఒక నిధిని కనుగొన్నారు.స్వీడన్ దేశానికి దగ్గరగా ఉన్న బాల్టిక్ సముద్రంలో( Baltic Sea ) ఓడ ఒకటి మునిగిపోయిందని వారికి తెలిసింది.

 175-year-old Bottles Of Champagne Discovered By Polish Divers In A Shipwreck Det-TeluguStop.com

అయితే, ఆ ఓడను( Ship ) దగ్గరగా పరిశీలించగా అది చాలా ఓల్డ్ షిప్ అని తెలిసింది.ఆ ఓడలో చాలా విలువైన వస్తువులు ఉన్నాయి.

వందల సంవత్సరాల నుంచి తెరవని షాంపైన్ బాటిళ్లు కూడా అందులో ఉన్నాయి.

Telugu Champagne, Baltic Sea, Divers, Nri, Ship, Shipwreck, Poland, Polish Diver

బాల్టిక్‌టెక్ అనే ప్రైవేట్ డైవింగ్ గ్రూప్‌లోని కొంతమంది డైవర్లు ఈ ఓడను కనుగొన్నారు.వారు సముద్రం లోతుల్లోకి వెళ్లి, దాదాపు రెండు గంటలు అక్కడే గడిపారు.తిరిగి వచ్చిన తర్వాత, వారు కనుగొన్న విషయం అందరినీ ఆశ్చర్యపరిచింది.

ఆ ఓడలో చైనా మట్టితో చేసిన పాత్రలు, మినరల్ వాటర్ బాటిళ్లు, వందల సంవత్సరాల నుంచి తెరవని షాంపైన్ బాటిళ్లు( Champagne Bottles ) ఉన్నాయి.ఆ ఓడలో ఉన్న మినరల్ వాటర్ బ్రాండ్ పేరు “సెల్టర్స్”.

ఈ మినరల్ వాటర్‌ను చాలా కాలం క్రితం రాజులు, రాణులు తాగేవారు.ఈ బ్రాండ్ ఇప్పటికీ ఉత్పత్తి అవుతుంది.

Telugu Champagne, Baltic Sea, Divers, Nri, Ship, Shipwreck, Poland, Polish Diver

ఆ ఓడలో ఉన్న షాంపైన్ బ్రాండ్ ఏమిటో ఇంకా తెలియదు.కానీ, ఆ షాంపైన్‌ను స్టాక్‌హోమ్ లేదా సెయింట్ పీటర్స్‌బర్గ్‌లోని రాజుల కోర్టులకు తీసుకెళ్తున్నారేమో అని డైవర్లు అనుకుంటున్నారు.ఈ ఓడను కనుగొన్న డైవింగ్ గ్రూప్ లీడర్ తోమస్ స్టాచురా మాట్లాడుతూ, “నేను 40 ఏళ్లుగా డైవింగ్ చేస్తున్నా.ఇంతకు ముందు చాలాసార్లు మునిగిపోయిన ఓడల్లో ఒకటి రెండు బాటిళ్లు మాత్రమే కనుగొన్నా.

కానీ ఇంత పెద్ద కార్గోను కనుగొనడం ఇది మొదటిసారి” అని చెప్పారు.

ఈ షాంపైన్‌ బాటిళ్లు 150 ఏళ్ల కంటే పాతవి కావచ్చు.

ఇవి ఇప్పటికీ తాగడానికి పనికి వస్తాయా అని అందరూ ఆశ పడుతున్నారు.ఈ ఆవిష్కరణ చరిత్రకారులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube