విశాఖ ఎయిర్ పోర్టు దగ్గర ఉద్రిక్తత నెలకొంది.మంత్రులు రోజా, జోగి రమేశ్ లతో పాటు వైవీ సుబ్బారెడ్డి కార్లపై దాడులు జరిగాయి.
జనసేన కార్యకర్తలు రాళ్లు, కర్రలతో దాడికి పాల్పడినట్లు సమాచారం.దీంతో విమానాశ్రయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
అయితే ఎయిర్ పోర్టుకు వెళ్తుండగా తమ కార్లపై జనసేన కార్యకర్తలు దాడి చేశారని మంత్రి జోగి రమేశ్ ఆరోపిస్తున్నారు.మద్యం తాగి దాడులు చేస్తున్నారన్న ఆయన.తమ పార్టీ కార్యకర్తలను అదుపులో ఉంచుకోవాలని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కు సూచించారు.అరాచకశక్తులు చేసే కార్యక్రమం ఇదని మండిపడ్డారు.
దాడులు చేయడం మంచి పద్ధతి కాదన్న మంత్రి జోగి.చిల్లర వేషాలు వేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.