తమకు న్యాయం చేయమని టీడీపీ ఇన్ చార్జ్ ప్రవీణ్ ఇంటికి వెళ్లిన డ్వాక్రా మహిళలపైన టీడీపీ వాళ్లు దాడి చేసి భూతులు తిట్టారని ప్రొద్దుటూర్ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి విమర్శించారు.పోలీసులు ఇరువర్గాలపై కేసులు పెడితే ఆ గొడవను తనకు రుద్దే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
తనపై టీడీపీ నేతలు చేసిన అవినీతి ఆరోపణలపై తానే స్వయంగా సీబీఐ విచారణ చేయమని కోరాతానన్నారు.
దమ్ము ఉంటే విమర్శలు చేసిన నారా లోకేస్, అచ్చంనాయుడు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా తమపైన విచారణ కోరుతూ సీబీఐని కలవాలన్నారు.
తాను సీబీఐ దగ్గరకు వెళ్లే డేట్ కూడా చెబుతానని ఆరోజే వాళ్లు కూడా వచ్చి సీబీఐ విచారణ కోరాలని సవాల్ విసిరారు.