బీజేపీ ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్ మరోసారి మండిపడ్డారు.రంగారెడ్డి జిల్లా బొంగులూరులో రైతుల అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు.
మోటార్లకు మీటర్లు పెట్టాలనే డేంజర్ నిర్ణయం కేంద్రం తీసుకుంటోందని మంత్రి కేటీఆర్ విమర్శించారు.ప్రీ పెయిడ్ మీటర్లు పెడితేనే రాష్ట్రానికి నిధులు ఇస్తామని బెదిరిస్తున్నారని ఆరోపించారు.
తెలంగాణలో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయండి అంటే కేంద్రమంత్రి పియూష్ అవమానించేలా మాట్లాడారని మండిపడ్డారు.అదేవిధంగా మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి రూ.18 వేల కోట్ల కాంట్రాక్టులు ఇచ్చారని ఆరోపించారు.బీజేపీ పాలనలో ఒక వ్యక్తి సంపాదన మాత్రమే విపరీతంగా పెరుగుతోందన్నారు.
రాజగోపాల్ రెడ్డి ధనవంతుడు అయితే.నల్గొండ జిల్లా ప్రజలు ధనవంతులు కాలేరని చెప్పారు.
ఒక్కరే ధనవంతులు అయితే రాష్ట్రం బాగుపడదని స్పష్టం చేశారు.