సినిమా కోసం రెండు వైపులా ముక్కు కుట్టించుకున్న ఈ కాంతారా బ్యూటీ ఎవరంటే?

ఒక్కొక్కరు సినిమా కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు.ఎందుకంటే వారికీ నటన మీద అంత ఫ్యాషన్ ఉంటుంది.

 Sapthami Gowda To Play Character Leela In Movie Kantara , Kantara Movie, Rishab-TeluguStop.com

వారికీ పాత్ర నచ్చితే చాలు ఆ పాత్ర కోసం ఏదైనా చేస్తారు.మరి ఇప్పటికే చాలా ఘటనలు మనం చూసాం.

ఇక తాజాగా మరొక ఆశ్చర్యపోయే ఘటన ఇప్పుడు బయటకు వచ్చింది.తాజాగా రిలీజ్ అయినా కాంతారా సినిమా కోసం హీరోయిన్ క్రేజీ పని చేసింది.

ఇది విని అంతా ఆశ్చర్య పోతున్నారు.

రిషబ్ శెట్టి నటించిన కాంతారా సినిమా కన్నడంలో రిలీజ్ అయ్యి రికార్డ్ స్థాయి వసూళ్లు సాధిస్తూ బాక్సాఫీస్ దగ్గర అసాధారణమైన విజయాన్ని నమోదు చేసుకుంది.

ఇక ఈ సినిమా పరుగులు చూస్తుంటే ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు.ఇప్పటికే కాంతారా సినిమా బాక్సాఫీస్ దగ్గర 58 కోట్లకు పైగానే వసూళ్లు సాధించింది.ముందు ముందు ఈ సినిమా కన్నడ లోనే 100 కోట్లు సాధించిన ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు అంటున్నారు

ఇక కాంతారా తెలుగు వర్షన్ ను కూడా తాజాగా రిలీజ్ చేయగా ఇక్కడ కూడా మంచి టాక్ తెచ్చుకుని దూసుకు పోతుంది.ఇదిలా ఉండగా ఈ సినిమాలో రిషబ్ శెట్టికి జోడీగా నటించిన హీరోయిన్ సప్తమి గౌడ.

ఈమె ఈ సినిమాతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.అయితే ఈ సినిమా కోసం ఈమె చేసిన పని ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

సప్తమి గౌడ ఈ సినిమా కోసమే రెండు వైపులా ముక్కు కుట్టించు కుందట.

Telugu Kannada, Kantara Actress, Kantara, Rishab Shetty, Sapthami Gowda, Saptham

ఈ సినిమాకు ముందు వరకు ఒక వైపు కూడా కుట్టించుకొని ఈ భామ ఈ సినిమా కోసం ఏకంగా రెండు వైపులా కుట్టించు కున్నట్టు రిషబ్ శెట్టి తెలిపాడు.ఇప్పుడు ఏ ఫోటో చుసిన ఈమె రెండు వైపులా ముక్కుపుడక కనిపిస్తూ వెలిగిపోతుంది అనే చెప్పాలి.ఇదంతా విని నెటిజెన్స్ ఈమెను ప్రశంసిస్తున్నారు.

ఈ సినిమా తర్వాత ఈమె బాగా ఫేమస్ అయ్యి భారీ ఫాలోవర్స్ ను కూడా సంపాదించు కుంది.మరి ఈ సినిమాతో ముందు ముందు ఎన్ని అవకాశాలు అందుకుంటుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube