అవినీతి హెడ్మాస్టర్ ను సస్పెండ్ చేయాలని కలెక్టర్ కు ఫిర్యాదు

నల్లగొండ జిల్లా:నల్లగొండ జిల్లా చండూరు(Nalgonda District ,Chandur) ఉన్నత పాఠశాలలో విద్యార్దులకు మధ్యాహ్న భోజనం మెనూ ప్రకారం పెట్టకుండా మిడ్డే మీల్స్ బిల్లులు స్వాహా చేసి తన సొంత అకౌంట్లో వేసుకున్న హెడ్మాస్టర్ ఎడ్ల భిక్షంపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ,ఎస్సీ,ఎస్టీ,బీసీ విద్యార్ధి,ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టర్ కి వినతిపత్రం అందజేశారు.

అనంతరం ఎస్సీ,ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కట్టెల శివకుమార్,ఎస్ఎఫ్ఐ నల్గొండ జిల్లా కార్యదర్శి ఖమ్మంపాటి శంకర్,బీసీ రాజ్యాధికార సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ మార్గం సతీష్ కుమార్ మాట్లాడుతూ.

ప్రభుత్వ పాఠశాల హెడ్మాస్టర్ మధ్యాహ్నం భోజనం వండే మహిళ కార్మికులు స్వాతిముత్యం సంఘం సభ్యులను డైలీ వైస్ లేబర్ గా పనులకు వినియోగించుకుంటూ వారి సమభావన సంఘం అకౌంట్లో డబ్బులు జమ చేయకుండా సరుకులు సామాన్లు వంట సామాగ్రి తానే స్వయంగా తీసుకొచ్చి వంటలు వండించడం జరిగిందని, సుమారు పదేళ్లుగా పూర్వపు హెడ్మాస్టర్, ప్రస్తుత హెడ్మాస్టర్ భిక్షం మధ్యాహ్న భోజనాన్ని పర్యవేక్షించాల్సింది పోయి,సాంఘిక సంక్షేమ హాస్టల్లో పనిచేస్తున్న వార్డెన్ మాదిరిగా బిల్లులను తన సొంత అకౌంట్లో వేసుకొని సమభావన సంఘాన్ని డైలీ లేబర్ గా మార్చి వారికి రావాల్సిన బిల్లులను స్వాహా చేయడం జరిగిందన్నారు.గత పదేళ్లుగా జరిగిన అవినీతి,అక్రమాలపై పూర్తిగా విచారణ చేసి 10 సంవత్సరాల మెనూ బిల్లులు సమభావన సంఘానికి అందే విధంగా చూడాలని కలెక్టర్ ను కోరినట్లు చెప్పారు.

ఈ కార్యక్రమంలో ఎస్సీ,ఎస్టీ, విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్,ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఖమ్మం పాటి శంకర్,బీసీ రాజ్యాధికార సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ మార్గం సతీష్ కుమార్,కామల్ల నరేష్ కుమార్,కొండన్న, బాకీ తరుణ్ తదితరులు పాల్గొన్నారు.

రవాణా శాఖ కమిషనర్ గా నల్గొండ జిల్లా ఐఏఎస్
Advertisement

Latest Nalgonda News