ఇంత డబ్బు పిచ్చేంటి రామా?

సక్సెస్‌ లేని హీరోలు, హీరోయిన్‌లు పారితోషికం విషయంలో పట్టు విడుపులను ప్రదర్శించాల్సి ఉంటుంది.కాని రామ్‌ మాత్రం తనకు సక్సెస్‌ వచ్చినా, ఫ్లాప్‌ వచ్చినా కూడా తాను డిమాండ్‌ చేసిన పారితోషికం ఇవ్వాల్సిందే అని డిమాండ్‌ చేస్తూ ఉంటాడు.

 Hero Ram Demanding Complete Money From Producers-TeluguStop.com

గతంలో ఈయన ‘కందిరీగ’ సినిమా సమయంలో పారితోషికం విషయంలో వివాదం క్రియేట్‌ చేశాడు.ఈ సినిమా విడుదల సమయంలో రామ్‌ పారితోషికం లొల్లి పెట్టడంతో ఫిల్మ్‌ చాంబర్‌ పెద్దలు వివాదాన్ని చక్క బెట్టాల్సి వచ్చింది.

మరోసారి రామ్‌ పారితోషికం విషయంలో వివాదాన్ని రగిల్చాడు.

దాదాపు రెండు సంవత్సరాల క్రితం ప్రారంభం అయిన ‘పండుగ చేస్కో’ సినిమా ఇటీవలే షూటింగ్‌ పూర్తి అయ్యింది.

ఈ సినిమాకు డబ్బింగ్‌ కార్యక్రమాలు మొదలు పెట్టారు.అయితే ఈ క్రమంలో హీరో రామ్‌ డబ్బింగ్‌ చెప్పను అంటూ పేచి పెట్టాడట.

తాను ముందు చెప్పిన మూడు కోట్ల రూపాయల్లో ఇంకా 50 లక్షల బ్యాలెన్స్‌ ఇవ్వాల్సి ఉందని, అది ఇస్తేనే డబ్బింగ్‌ చెబుతాను అంటూ రామ్‌ డిమాండ్‌ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.అయితే నిర్మాత మాత్రం సినిమా విడుదలకు ముందే తప్పకుండా ఇస్తానంటూ చెప్పే ప్రయత్నం చేసినా కూడా ఫలితం లేకుండా ఉంది.

దాంతో నిర్మాత ఏదోలా రామ్‌ పారితోషికం ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు.ఈ విషయం తెల్సిన సినీ జనాలు ఇంత డబ్బు పిచ్చేంటి రామా, సక్సెస్‌ కొట్టు డబ్బు అదే వస్తుంది అంటూ సలహా ఇస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube