నేటి షెడ్యూల్ :   రాయలసీమలో షర్మిల.. గోదావరి జిల్లాలో జగన్ 

ఏపీలో నామినేషన్ల ప్రక్రియ( Nominations Process ) కూడా మొదలు కావడం తో ఎన్నికల వాతావరణం రోజుకు వేడెక్కుతోంది.ఇప్పటికే అన్ని ప్రధాన పార్టీల అధినేతలు ఎన్నికల ప్రచారంలో నిమగ్నం అయ్యారు.

 Ys Jagan Sharmila Bus Yatra Plan, Ysrcp, Ap Cm Jagan, Tdp, Telugudesam, Ap Congr-TeluguStop.com

క్షణం తీరిక లేదన్నట్లుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ప్రజలను ఆకట్టుకునే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు.ఒకవైపు తాము అధికారంలోకి వస్తే ఏ రకమైన పరిపాలన అందిస్తాము.

  ఎటువంటి సంక్షేమ పథకాలను అందిస్తామో వివరిస్తూ ప్రత్యర్థులపై రాజకీయ విమర్శలు చేస్తున్నారు.జనాలు చూపు తమ పార్టీపై ఉండేలా చేసుకునే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు.

మండుటెండలను సైతం లెక్కచేయకుండా ఎన్నికల ప్రచారం పనే అన్ని పార్టీల నాయకులు దృష్టి సారించారు.ఇక ఈరోజు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల, వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్( AP CM YS Jagan ) ఎన్నికల ప్రచార కార్యక్రమాల షెడ్యూల్ ను  ఒకసారి పరిశీలిస్తే…


Telugu Ap Cm Jagan, Ap Congress, Ap, Telugudesam, Ys Jagan, Ysjagan, Ys Sharmila

ఈరోజు కర్నూలు జిల్లాలో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల( AP Congress Sharmila ) ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఒకసారి పరిశీలిస్తే.  ఈరోజు కర్నూలు జిల్లాలో ఆమె పర్యటించనున్నారు.గత కొద్దిరోజులుగా న్యాయ యాత్ర పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా షర్మిల పర్యటిస్తున్నారు .నిన్న అనంతపురం జిల్లాలో( Anantapuram ) మూడు నియోజకవర్గాల్లో షర్మిల పర్యటించారు.ఈ సందర్భంగా జగన్ ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో ఆమె విమర్శలు చేస్తూ కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాల్సిందిగా కోరారు.

ఈరోజు ఉదయం 10 గంటలకు ఆలూరు లో బహిరంగ సభలో షర్మిల పాల్గొంటారు.సాయంత్రం నాలుగు గంటలకు ఆదోనిలో జరగనున్న బహిరంగ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించునున్నారు.

వరుసగా మూడు నియోజకవర్గాల్లో షర్మిల ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రను నిర్వహిస్తున్న వైసీపీ అధినేత , ఏపీ సీఎం జగన్ యాత్ర నేటి షెడ్యూల్ ఈ విధంగా ఉంది .

Telugu Ap Cm Jagan, Ap Congress, Ap, Telugudesam, Ys Jagan, Ysjagan, Ys Sharmila

తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న జగన్ నిన్న రాత్రి బస చేసిన ఎస్టీ రాజపురం నుంచి ఈరోజు ఉదయం బస్సు యాత్రను ప్రారంభించనున్నారు.రంగంపేట ,పెద్దాపురం బైపాస్,  సామర్లకోట బైపాస్ మీదుగా ఉందూరు క్రాస్ రోడ్డుకు జగన్ బస్సు యాత్ర చేరుకుంటుంది.అక్కడ జగన్ భోజనం విరామం కు ఆగుతారు .ఆ తరువాత ఉందూరు క్రాస్ కాకినాడ బైపాస్ మీదుగా సాయంత్రం 3.30 గంటలకు కాకినాడ అచ్చంపేట జంక్షన్( Kakinada Achampet Junction ) వద్ద జగన్ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.ఆ తరువాత పిఠాపురం బైపాస్, గొల్లప్రోలు బైపాస్,  కత్తిపూడి ,తుని ,పాయకరావుపేట మీదుగా గుడి చర్ల క్రాస్ వద్ద నైట్ క్యాంపుకు చేరుకుంటారు.

  జగన్ బహిరంగ సభకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పార్టీ శ్రేణులు పూర్తి చేశాయి.సాయంత్రం జరిగే బహిరంగ సభలో పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని అభ్యర్థులను జగన్ పరిచయం చేసే విధంగా షెడ్యూల్ రూపొందించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube