ప్రస్తుత కాలంలో కొందరు టిక్ టాక్ మోజులో పడి ఎలాగైనా ఫేమస్ అవ్వాలని పలు వింత పోకడలను ఆచరిస్తున్నారు.అంతేగాక సమయం సందర్భం వంటివి పాటించకుండా టిక్ టాక్ వీడియోలు చేస్తూ నవ్వులపాలు అవుతున్నారు.
మరికొందరైతే ఏకంగా కటకటాల పాలవుతున్నారు.తాజాగా ప్రభుత్వం విధించినటువంటి లాక్ డౌన్ లెక్క చేయకుండా ఓ యువకుడు మద్యాన్ని దానం చేస్తూ టిక్ టాక్ వీడియో చేసినందుకు గాను యువకుడిని పోలీసులు అరెస్టు చేసిన ఘటన హైదరాబాద్ నగరంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే తెలంగాణ రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాదు లో పాతబస్తీ ప్రాంతంలో కుమార్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు.అయితే ఇతడికి తరచూ టిక్ టాక్ వీడియోలు చేయడం అలవాటు.
అయితే గతకొద్దికాలంగా కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు దేశ మరియు రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించాయి .దీంతో ప్రజలకు అవసరమైన సదుపాయాలు తప్ప మిగిలిన అన్ని సదుపాయాలను మూసివేశారు.అయితే ఇందులో భాగంగా మద్యం దుకాణాలను కూడా ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా మూసివేశారు.
దీంతో గత కొద్ది కాలంగా మందుబాబులు మందు దొరక్క తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
అయితే ఈ విషయాన్ని గ్రహించినటువంటి యువకుడు వైరల్ అవ్వాలనే ఉద్దేశంతో వెంటనే 10 మద్యం బాటిళ్లను కొనుక్కుని స్థానికంగా ఉంటున్నటువంటి కొందరికి సరఫరా చేశాడు.అంతేగాక కుమార్ మద్యం పోస్తున్న సమయంలో వీడియోను కూడా తీసి టిక్ టాక్ లో షేర్ చేశాడు.
దీంతో ఈ విషయం ఈ వీడియోని చూసినటువంటి స్థానిక పోలీసులు వెంటనే కుమార్ ని అదుపులోకి తీసుకుని అతడిపై పలురకాల సెక్షన్లు క్రింద కేసు నమోదు చేశారు.