ప్రస్తుత కాలంలో కొందరి కామ వాంఛలకు అభం శుభం తెలియని చిన్నారులు బలవుతున్నారు.ఇందులో ముఖ్యంగా కొందరు టీచర్లు చేసేటటువంటి పనులకు ఏకంగా ఉపాధ్యాయ వృత్తికే కళంకం ఏర్పడుతోంది.
ఓ మహిళా టీచర్ తను పని చేస్తున్నటువంటి పాఠశాలలోని ఓ విద్యార్థి తో లైంగిక సంబంధం పెట్టుకున్న ఘటన అమెరికాలోని నార్త్ కరోలినా లో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే కార్లీ ఎరిన్ కజ్మారెక్ అనే మహిళ నార్త్ కరోలినా పరిసర ప్రాంతంలో నివాసం ఉంటోంది.
అయితే కార్లీ కుటుంబం పోషణ నిమిత్తమై దగ్గరలో ఉన్నటువంటి ఓ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేసేది.అయితే ఈ క్రమంలో తన పాఠశాలలో చదువుతున్న ఓ విద్యార్థి పై కన్నేసింది.
దీంతో ఎలాగైనా ఆ విద్యార్థిని లొంగదీసుకోవాలనే ప్రయత్నంలో విద్యార్థిని తన చేష్టలతో మరియు మాటలతో శృంగారానికి ప్రేరేపించేది.ఆమె మాటలకు పడిపోయినటువంటి విద్యార్థి ఆమెతో లైంగిక సంబంధం పెట్టుకున్నాడు.
దీంతో విద్యార్థితో కార్లేె ఎరిన్ నిత్యం శృంగారంలో పాల్గొనేది.
అయితే తాజాగా పాఠశాల ముగిసిన అనంతరం విద్యార్థితో క్లాస్ రూమ్ లో శృంగారంలో పాల్గొంటూ ఉండగా పాఠశాల యాజమాన్యం గుర్తించి ఈ విషయం గురించి పోలీసులకు ఫిర్యాదు చేసింది.అలాగే ఆమెను సస్పెండ్ చేస్తూ చిన్నపిల్లలని శృంగారానికి ప్రేరేపించిన అందువల్ల ఆమె పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ పోలీసులను కోరింది.దీంతో పోలీసులు ఆమెపై కేసు నమోదుచేసి విచారణ కోసం రిమాండ్ కి తరలించారు.