గుర్రంపోడు మండలంలో వైన్స్ ఓనర్ల ఇష్టారాజ్యం

నల్లగొండ జిల్లా:రాష్ట్ర ఖజానాకు ప్రధాన ఆదాయ వనరుగా మారిన లిక్కర్ బిజినెస్ ను కొందరు లిక్కర్ వ్యాపారులు,అబ్కారీ శాఖ అధికారుల అండదండలతో ఎక్సైజ్ నిబంధనలను తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా సిండికేట్ దందా చేస్తూ, ఎమ్మార్పీకే ప్రజలకు అందాల్సిన లిక్కర్ ను గ్రామానికి పదుల సంఖ్యలో బెల్ట్ షాపులు ఏర్పాటు చేయించి,తద్వారా అధిక ధరలకు విక్రయిస్తూ అడ్డదారిలో ప్రజలను నిలువు దోపిడీ చేస్తుంటే అడ్డుకునే నాథుడే లేడా అని నల్లగొండ జిల్లా గుర్రంపోడ్ మండల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.మండల కేంద్రంలో రెండు,కొప్పోలు గ్రామంలో ఒకటి మొత్తం మండలంలో మూడు వైన్స్ షాపులు ఉన్నాయి.

ఈ మూడు షాపుల యాజమాన్యం సిండికేట్ గా ఏర్పడి,ఖరీదైన,డిమాండ్ ఉన్న మద్యం బ్రాండ్లను ఎమ్మార్పీ కంటే క్వార్టర్ కు రూ.15 నుండి రూ.100 వరకు అదనంగా తుసుకొని వారి కనుసన్నల్లో నడిచే బెల్ట్ షాపులకు సరఫరా చేస్తారు.ఈ మూడు వైన్స్ లో మాత్రం మందుబాబులకు అవసరమైన మద్యం బ్రాండ్లు కంటికి కనిపించవు.

ఫలానా బ్రాండ్ కావాలంటే వైన్స్ షాపుల దగ్గర నుండి బెల్ట్ షాపుల దగ్గరకు వెళ్లాల్సిందే.ఇదే అదునుగా బెల్ట్ షాపుల వారు ఏ బ్రాండ్ అయినా దొరుకుతుంది కానీ,ఎమ్మార్పీ కంటే అదనంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తారు.ఉదాహరణకు ఒక ఖరీదైన బ్రాండ్ ఎమ్మార్పీ ధర రూ.320 ఉంటే దానికి వైన్స్ వారు బెల్ట్ షాపుకు రూ.345 కు సరఫరా చేస్తారు,బెల్ట్ షాపు నిర్వాహకులు రూ.400 లకు విక్రయిస్తారు.మద్యం డిమాండ్ ను బట్టి ఈ అదనపు ధరల్లో మార్పులు ఉంటాయని,అంతే కాదు బెల్ట్ షాపుల్లో ఈ మూడు వైన్స్ నుండి వచ్చిన మద్యం మాత్రమే అమ్మాలి,కాదని వేరే మందు కనిపిస్తే వైన్స్ యాజమాన్యం ఎక్సైజ్ అధికారుల్లా బెల్ట్ షాపులఇళ్లలోకి దూరి సోదాలు నిర్వహించడం,పొరపాటున వేరే మద్యం కనిపిస్తే ఎక్సైజ్ అధికారులతో కేసులు పెట్టించడం,నిల్వ ఉన్న మద్యం బలవంతంగా లాక్కెళ్ళడం షరా మామూలే.దీనిపై బెల్ట్ నిర్వాహకులు స్పందిస్తూ అవును నిజమే వీళ్ళు ఒక్కో బాటిల్ పై రూ.100 అదనంగా తీసుకుంటే మేము అమ్మలేక పోతున్నాం,అందుకే పక్క మండలాల్లో ఎమ్మార్పీ ధరకు తెచ్చి రూ.20 అదనంగా అమ్ముకుంటున్నాం,మీరు ఎమ్మార్పీ కంటే అదనంగా మాకు అమ్మితే లేని తప్పు, మేము పక్క మండలాల్లో తెచ్చుకొని అమ్ముకుంటే తప్పేంటని అంటున్నారు.మండలంలో ఏ వైన్స్ షాపుకు పోయినా కావాల్సిన మద్యం ఉండదని నిత్యం మందు బాబులు వాగ్వాదానికి దిగి ఘర్షణ పడుతున్నా ఎక్సైజ్ శాఖ అధికారులకు ఇవేవీ పట్టకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తుందని,వైన్స్ లో మద్యం నిల్వలు ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాల్సిన సంబధిత అధికారులు మామూళ్ల మత్తులో పడి మందుబాబుల జేబులకు చిల్లులు పడేలా చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

బెల్టు షాపుల ద్వారా అధిక ధరలకు విక్రయిస్తూ లక్షల్లో అక్రమ సంపాదన ఆర్జిస్తున్నా ఈ మద్యం సిండికేట్ దందాకు మందే లేదా అంటూ మండల ప్రజలు,మందుబాబులు పాలకులను ప్రశ్నిస్తున్నారు.ఇప్పటికైనా అధికారులు మత్తులో నుండి తేరుకుని వైన్స్ షాపుల్లో ఎమ్మార్పీ ధరకే అన్ని రకాల మద్యాన్ని అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని,నిత్యం వైన్ షాపులపై పర్యవేక్షణ చేయాలని స్థానిక ప్రజలు, మద్యం ప్రియులు కోరుతున్నారు.

పంద్రాగష్టున మహిళా కార్యదర్శిపై దాడి బాధాకరం : అనంత చారి
Advertisement

Latest Nalgonda News