జనావాసాల మధ్య వైన్స్ షాపులు...మందుబాబుల వికృత చేష్టలు

నల్లగొండ జిల్లా:మునుగోడు నియోజకవర్గంలో బెల్ట్ షాపులు నిర్మూలించడంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాగోపాల్ రెడ్డి చేపట్టిన ప్రత్యేక కార్యక్రమాలకు ప్రజల్లో మంచి ఆదరణ లభించినా కొంతమంది వైన్స్ యాజమాన్యం తీరుతో కొందరు అక్కడక్కడా బెల్ట్ షాపులు నడుపుతున్న పరిస్థితి కనిపిస్తోంది.

అయితే మునుగోడు మండలంలో కొన్ని గ్రామాలు బెల్ట్ షాపులు నడపకుండా స్వచ్ఛందంగా ఏకగ్రీవ తీర్మానం చేశారు.

గత ప్రభుత్వం తప్పిదం వలన అధికారుల నిర్లక్ష్యంతో ఎక్కడపడితే అక్కడ ఊరు మధ్యలో వైన్స్ షాపులకు పర్మిషన్ ఇవ్వడంతో మందుబాబులు మద్యం సేవించి తప్పతాగి రోడ్డుపై నడుస్తూ,వైన్స్ ముందు గొడవలకు దిగుతూ,రోడ్డుపై బైకులు అధిక స్పీడు నడపడం,మందు బాబుల చేష్టలు చూసి స్కూల్స్ కు పోయే విద్యార్థినిలు,మహిళలు రోడ్లపై భయంతో వెళ్లవలసిన పరిస్థితి నెలకొంది.వైన్స్ షాపులను ఊరి చివర మార్చుటలో ఎక్సైజ్ శాఖ అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారని,దీనికి వైన్స్ యాజమాన్యంతో లాలూచీ పడడమే కారణమని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Wine Shops In The Middle Of The Population Are The Perverse Antics Of Drug Lords

బెల్ట్ షాపుల సంగతి సరే గానీ ఎమ్మేల్యే గారూ ఈ ఊరిమధ్యలో ఉన్న వైన్స్ షాపుల మాటేమిటని మునుగోడు ప్రజలు అడుగుతున్నారు.ఇప్పటికైనా ఎమ్మెల్యే, సంబంధిత అధికారులు చొరవ తీసుకొని ఊరికి బయట వైన్ షాపులను ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Latest Nalgonda News