ఆంధ్రప్రదేశ్ క్రియాశీలక రాజకీయాలకు పుట్టినిల్లు.గత కొన్నేళ్ల క్రితం కాంగ్రెస్,టిడిపి పార్టీలు మాత్రమే అక్కడ ఉండేవి.
కానీ వైయస్ రాజశేఖర్ రెడ్డి (Y.S.Rajashekkhar reddy) మరణాంతరం, రాష్ట్ర విభజన తర్వాత పూర్తిస్థాయి లో కాంగ్రెస్ అక్కడ లేకుండా పోయింది.ఈ క్రమంలోనే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరుతో జగన్ కొత్త పార్టీని పెట్టి రాజశేఖర్ రెడ్డి అభిమానులను తనవైపు తిప్పుకున్నారు.
ప్రస్తుతం అక్కడ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ( YSRCP ) మరియు తెలుగుదేశం పార్టీ మాత్రమే ప్రధాన పార్టీలుగా ఉన్నాయి.ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన సందర్భంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సీఎం అయితే, రెండవ సీఎంగా జగన్ ప్రస్తుతం ఏలుతున్నారు.
కట్ చేస్తే.ఇంకా కొన్ని నెలల్లో ఎన్నికలు ఉన్న సందర్భంగా మళ్లీ సీఎం ఎవరు అవుతారు అనేది ఆసక్తికరంగా మారింది.ఎలాగైనా ఈసారి గద్దె నెక్కాలని టిడిపి ( TDP ) ఎదురు చూస్తుంటే రెండవసారి కూడా గద్దెనెక్కి రికార్డు క్రియేట్ చేయాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రాబోవు రోజుల్లో ఎవరికి కలిసొస్తాయో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ప్రస్తుతం ఏపీలో జగన్ ఎన్నో పథకాలతో పేద ప్రజలకు అండగా నిలుస్తున్నారు.అంతేకాకుండా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ చంద్రబాబు ( Chandrabbau ) పాదయాత్రలు వివిధ రకాల సభలతో ముందుకు పోతున్నారు.
కానీ ఇవి రెండు ప్రధాన పార్టీలుగా ఉన్న తరుణంలో సినీ రంగం నుంచి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ( JanaSena Party )పెట్టి ముందుకు పోతున్నారు.ఈ తరుణంలో సినీ ప్రముఖులకు మరియు అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది.
తాజాగా బ్రో సినిమా ( Bro movie ) రిలీజ్ తర్వాత అంబటి రాంబాబు ప్రత్యేకంగా స్పందించి సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి బడా ఫ్యామిలీ అయినా చిరంజీవి ఫ్యామిలీని గెలికారు.దీంతో చిరంజీవి కూడా స్పందించి ధీటుగా సమాధానం ఇచ్చారు.ఈ తరుణంలోనే ఇంతకుముందు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసిన చిరు ఫ్యామిలీ రాబోవు ఎన్నికల్లో తప్పకుండా జనసేనకు, టిడిపి పార్టీకి సపోర్ట్ చేసే అవకాశం ఉంది.ఇండస్ట్రీలో బడా ఫ్యామిలీ అయిన నందమూరి, మెగా ఫ్యామిలీ ( Mega family ) లు ఇదివరకు అంతగా కలిసి ఉండేవారు కాదు.
కానీ ఈ మధ్యకాలంలో రెండు ఫ్యామిలీలు అన్నీ పక్కన పెట్టి ఒక కుటుంబ సభ్యుల్లా తిరుగుతున్నారు.ఇక నందమూరి ఫ్యామిలీ ( Nandamuri family ) పూర్తిగా టిడిపికి సపోర్ట్.
అంతేకాకుండా ఈసారి మెగా ఫ్యామిలీ కూడా టిడిపికీ సపోర్ట్ ఇచ్చే విధంగా ప్రస్తుత రాజకీయాలు నడుస్తున్నాయి.ఈ రెండు అంశాలు రాబోవు ఎన్నికల్లో చంద్రబాబుకి కలిసొచ్చే విధంగా కనిపిస్తున్నాయి.