టాలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతంగా నటించగల హీరోలలో జూ.ఎన్టీఆర్( Jr NTR ) ఒకడు.
ఈ హీరో ఆర్ఆర్ఆర్ సినిమాలో అద్భుతంగా నటించి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నాడు.ఏ పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేయగల ఈ యంగ్ టైగర్ కెరీర్ తొలినాళ్లలో హిట్స్ తో సమానంగా ఫ్లాప్స్ కూడా అందుకున్నాడు.
నిజానికి ఈ హీరో చేసిన మూడు సినిమాలకు ఒకరే రచయిత కథను అందించాడు.అతడే వక్కంతం వంశీ.
( Vakkantham Vamsi )
2006లో వంశీ అందించిన కథతో సురేందర్ రెడ్డి “అశోక్” సినిమా( Ashok Movie ) తీశాడు.జూనియర్ ఎన్టీఆర్ హీరోగా చేసిన ఈ మూవీ యావరేజ్ హిట్‌గా నిలిచింది.
తర్వాత కల్ట్ ఫిల్మ్‌గా పేరు తెచ్చుకుంది.మళ్లీ 5 ఏళ్లకు అంటే 2011లో వంశీ అందించిన కథతోనే సురేందర్ రెడ్డి “ఊసరవెల్లి” సినిమా( Oosaravelli ) తీశాడు.
ఇందులోనూ తారక్ హీరోగా నటించాడు.ఈ మూవీ ఫస్ట్ డే రూ.16.3 కోట్లు వసూలు చేసి హైయ్యెస్ట్ ఓపెనింగ్ డే గ్రాస్ రాబట్టిన సినిమాగా నిలిచి మునుపటి టాలీవుడ్ రికార్డులను బద్దలు కొట్టింది.బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ గానూ నిలిచింది.
ఆ తర్వాత ఎన్టీఆర్ కోసం వంశీ “టెంపర్” మూవీ( Temper Movie ) కథ రాసుకున్నాడు.ఈ స్టోరీతో తానే సినిమాని డైరెక్ట్ చేసే అవకాశం ఇవ్వాలని ఎన్టీఆర్ ని అడిగాడు.నిజానికి జూ.ఎన్టీఆర్ కి వంశీ మొదటినుంచి మంచి స్నేహితుడిగా ఉంటూ వచ్చాడు.అతడి కోసమే కథలు రాసుకున్నాడు.
అయితే టెంపర్ మూవీ కథ విన్నప్పుడు ఎన్టీఆర్‌కి బాగా నచ్చేసింది.కానీ ఆ స్టోరీతో వంశీ డైరెక్షన్ చేస్తానంటే మాత్రం ఒప్పుకోలేదు.
ఆ కథతో పూరీ జగన్నాథ్( Puri Jagannath ) చేత సినిమా తీద్దామని వంశీకి చెప్పాడు.అయితే పూరి జగన్నాథ్ వేరే వారి కథతో సినిమా తీయడానికి ఒప్పుకోనన్నాడు.
తాను రాసిన కథతోనే సినిమా తీస్తానని పట్టుపట్టాడు.కానీ ఎన్టీఆర్ వంశీని, పూరి జగన్నాథ్ ని ఒప్పించి మూవీని పూరీతోనే డైరెక్ట్ చేయించాడు.
ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది.
అనంతరం తారక్ వంశీకి ఓ హామీ ఇచ్చాడు.కథ రాసుకొని వస్తే తన డైరెక్షన్లోనే తప్పకుండా సినిమా చేస్తానని వంశీకి మాట ఇచ్చాడు.దాంతో ఖుషి అయిన సదరు రచయిత ఎన్టీఆర్ కోసం “నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా”( Naa Peru Surya Naa Illu India ) కథ రాసుకున్నాడు.
అది నచ్చకపోవడంతో ఎన్టీఆర్ మరో ఆలోచన లేకుండా రిజెక్ట్ చేశాడు.దీంతో చేసేదేమీ లేక అల్లు అర్జున్ను హీరోగా పెట్టి ఆ సినిమాను రూపొందించాడు.ఈ మూవీ అట్టర్ ఫ్లాప్ అయ్యింది.ఒకవేళ టెంపర్ సినిమాని డైరెక్ట్ చేసే అవకాశం వంశీకి ఇచ్చినట్లయితే అతడు తన తొలి సినిమాతోనే మంచి హిట్టు కొట్టేవాడు.
సక్సెస్ఫుల్ దర్శకుడిగా టాలీవుడ్ ఇండస్ట్రీలో పేరు తెచ్చుకునే వాడు కానీ ఎన్టీఆర్ ఆ అవకాశం ఇవ్వకుండా ఇతడికి అన్యాయం చేశాడని కొందరు విమర్శిస్తుంటారు.