సినిమా హిట్ కావాలంటే కథ మాత్రమే కాదు టైటిల్ కూడా బాగుండాలి.ఆ టైటిల్ సినిమా స్టోరీ మొత్తాన్ని ప్రతిబింబించాలి.
అందుకే టైటిల్ విషయంలో దర్శక నిర్మాతలతో పాటు హీరోలు చాలా ఆలోచనలు చేస్తారు.నిజానికి సింగిల్ టైటిల్ సినిమాకి కావలసిన హైప్‌ని కూడా తీసుకొస్తుంది.
కొంతమంది దర్శకులు చాలా డిఫరెంట్‌గా ఆలోచిస్తారు.వారాల పేర్లు, నెలల పేర్లు సినిమాలు పెట్టిన దర్శకులు కూడా ఉన్నారు.
కొంతమంది పండుగల పేర్లనే సినిమా పేర్లగా ఖరారు చేసుకున్నారు.ఆ టైటిల్స్ తోనే హిట్స్ కూడా అందుకున్నారు.ఆ సినిమాలేవో తెలుసుకుందాం.
• సంక్రాంతి
ముప్పలనేని శివ డైరెక్ట్ చేసిన “సంక్రాంతి” సినిమా( Sankranti Movie ) గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు.ఇందులో వెంకటేష్, శ్రీకాంత్, శివ బాలాజీ, స్నేహా, సంగీత, ఆర్తి అగర్వాల్ మెయిన్ రోల్స్ పోషించారు. ‘సంక్రాంతి’ అనే పండుగ పేరుతో తెరకెక్కిన ఈ సినిమా అనూహ్యమైన విజయాన్ని అందుకుంది.
• దసరా
తెలుగు రాష్ట్రాల్లో దసరా పండుగను( Dasara ) ఎంత గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఆ పండుగ పేరుని శ్రీకాంత్ ఓదెల తన సినిమాకి టైటిల్‌గా పెట్టుకున్నాడు.ఇందులో నాని, కీర్తి సురేష్ హీరో హీరోయిన్లుగా చేశారు.ఈ మూవీ కూడా మంచి హిట్ అందుకుంది.
• రాఖీ
కృష్ణవంశీ తాను రూపొందించిన సినిమాకి రాఖీ (2006)( Rakhi ) అని పేరు పెట్టాడు.ఈ పేరుకు తగినట్లుగానే సినిమా కథ నడుస్తుంది.ఇందులో ఎన్టీఆర్, ఇలియానా, ఛార్మి మెయిన్ లీడ్ రోల్స్ చేశారు.
• హోలీ
ఎస్వీఎన్ వరప్రసాద్ డైరెక్షన్‌లో ఉదయ్ కిరణ్, రిచా తారాగణంతో తెరకెక్కిన 2002లో సినిమాకి హోలీ( Holi Movie ) అని టైటిల్ పెట్టారు.ఈ సినిమా కూడా బాగానే ఆకట్టుకుంది.
• ఉగాది
ఎస్.వి.కృష్ణారెడ్డి తన సినిమాకు తెలుగువారి నూతన సంవత్సరాది అయిన “ఉగాది (1997)”ని( Ugadi ) టైటిల్ గా పెట్టాడు.దీనిని డైరెక్ట్ చేయడమే కాక హీరోగా నటించాడు.ఇందులో హీరోయిన్ లైలా అతనితో రొమాన్స్ చేసింది.
• మహా శివరాత్రి
రాజేంద్ర ప్రసాద్, మీనా నటించిన సినిమాకి “మహా శివరాత్రి”( Maha Shivaratri ) అని టైటిల్ పెట్టారు.రేణుక శర్మ ఈ సినిమాని డైరెక్ట్ చేసింది.
గురు పౌర్ణమి, కృష్ణాష్టమి, దీపావళి వంటి పండుగల పేర్లతో కూడా సినిమాలు వచ్చాయి.ఇవి కూడా ఆకట్టుకున్నాయి.